సీఎల్పీ నేత జననాయకుడు భట్టి విక్రమార్క మార్చి 16న చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 85వ రోజు నాటికి 996 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ పాదయాత్రలో వందల 500 పైగా గ్రామాలు.. తాండాలు, పల్లెలు, పట్టణాలు చుట్టేస్తూ సాగుతోంది.
గిరిజనులు, ఆదివాసీలు, బడుగు, బలహీన వర్గాలు, మైనారీటీలు, అట్టడుగు వర్గాలు, అణగారిన ప్రజలు.. భట్టి విక్రమార్కను జన నాయకుడిగా పేర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలుపుతీరాలకు చేర్చే చుక్కానిలా భట్టి విక్రమార్క పాదయాత్ర ముందుకు సాగుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి దూరమైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అట్టడుగు, అణగారిన వర్గానలు తిరిగి పార్టీకి దగ్గర చేయడంలో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర విజయం సాధించిందని చెప్పవచ్చు. .
మార్చిన 16న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం బజరహాత్నూర్ మండలం పిప్పిరి గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఇప్నటికే బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, రామగుండం, ధర్మపురి, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, స్టేషన్ ఘన్ పూర్, జనగామ, అలేరు, భువనగిరి, ఇబ్రహీం పట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్ నగర్, పరిగి, జడ్చెర్ల, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకొండ నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగిన నియోజకవర్గాల్లో పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావడంతో పాటు.. కేడర్ లో సరికొత్త జోష్ నెలకొంది. దీంతో ఇప్పుడు పాదయాత్ర వెళ్లని నాయకులనుంచి.. మా నియోజకవర్గాల్లో కూడా పాదయాత్ర చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీద తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. భట్టి పాదయాత్ర నియోజకవర్గాల్లో సాగితే.. పార్టీలో కొత్త జోష్ రావడంతో పాటు, అభ్యర్థుల గెలుపు అవకాశాలు పెరుగుతున్నాయన్న అంచనాలతో.. పీపుల్స్ మార్చ్ పై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
గాలి దుమారాలు.. విపరీత ఎండలు.. ఊహించన భారీ వర్షాలు.. అయినా కూడా తనతో నడిచే కార్యకర్తలతో సమానంగా టెంట్ లో ఉంటూ.. వారితో కలిసి తింటూ.. కలియ తిరుగుతున్న భట్టి విక్రమార్క.. సరికొత్త ట్రెండ్ సెట్టర్ గా మారారు. కాంగ్రెస్ నౌకను గెలుపు తీరాలకు చేర్చే.. తెరచాపలా.. భట్టి విక్రమార్క ముందుకు సాగుతున్నారు.
ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ హన్మకొండ జనగామ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి వికారాబాద్ మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ నల్లగొండ సూర్యాపేట ఖమ్మం జిల్లాలో పాదయాత్ర కొనసాగిన తరువాత
ఈనెల 25 నాటికి 101 రోజులు పాదయాత్ర పూర్తి అవుతుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరవుతారు. ముగింపు సభకు దాదాపుగా రెండు లక్షల పైగా జనాలు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగానే నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మార్చి 16న పాదయాత్ర పిప్పిరి గ్రామం నుంచి ప్రారంభం
మార్చి 22న ఆసిఫాబాద్ నియోజకవర్గం కేరి మేరి మండలం జరీ గ్రామంలో 125 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కటింగ్
ఏప్రిల్ 14న మంచిర్యాలలో సత్యాగ్రహ దీక్ష పేరిట భారీ బహిరంగ సభ
ఏప్రిల్ 16న 300 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా మంచిర్యాల జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి బ్రిడ్జి పైన కేక్ కటింగ్ చేశారు.
ఏప్రిల్ 29 జనగామ జిల్లా నార్మెట్ట వద్ద 500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నది.
మే 25న మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం కేంద్రంలో పీపుల్స్ మార్చ్ బహిరంగ సభ నిర్వహించారు ఈ సభకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుక్వేందర్ సింగ్ సుక్ ముఖ్య అథిధిగా వచ్చారు.
జూన్ 10న పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు 1000 కిలోమీటర్లు పూర్తి అవుతున్నది. ఈ సందర్భంగా దేవరకొండలో నిర్వహించే సభకు రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రంజిత్ రంజన్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు.
వెయ్యి కిలోమీటర్లు పూర్తవుతున్న సందర్భంగా గుమ్మడవెల్లి లో పైలాన్ నిర్మాణం జరుగుతున్నది.