• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

మార్చి 1న ‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటించిన ‘చారి 111’ విడుదల

admin by admin
February 8, 2024
in movies
0 0
0
మార్చి 1న ‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటించిన ‘చారి 111’ విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటిస్తున్న సినిమా ‘చారి 111’. టీజీ కీర్తి కుమార్ దర్శకుడు. సుమంత్ హీరోగా ‘మళ్ళీ మొదలైంది’ వంటి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ తీసిన తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. ఇందులో సంయుక్తా విశ్వనాథన్ కథానాయిక. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మార్చి 1న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు.

‘చారి 111’ రిలీజ్ డేట్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా, ప్రేక్షకుల్లో క్యూసియాసిటీ కలిగించే విధంగా డిజైన్ చేశారు. థియేటర్లలోకి గూఢచారిగా ప్రేక్షకుల్ని నవ్వించడానికి ‘వెన్నెల’ కిశోర్ వస్తున్నట్లు ఉంది. ఈ జనరేషన్ కమెడియన్లలో తనకంటూ సపరేట్ కామెడీ స్టైల్ క్రియేట్ చేసుకున్న ఆయన… ఈ సినిమాలో ఏ విధంగా నవ్విస్తారో థియేటర్లలో చూడాలి.

‘చారి 111’ ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కన్‌ఫ్యూజ్ అయ్యే గూఢచారిగా ‘చారి’ పాత్రలో వెన్నెల కిశోర్ కనిపిస్తారని దర్శక నిర్మాతలు తెలిపారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే యాక్షన్ సినిమా తీశామని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు.

చిత్ర దర్శకుడు టీజీ కీర్తి కుమార్ మాట్లాడుతూ ”ఇదొక స్పై యాక్షన్ కామెడీ సినిమా. సిల్లీ మిస్టేక్స్ చేసే ఒక స్పై పెద్ద కేసును ఎలా సాల్వ్ చేశాడనేది సినిమా. వెన్నెల కిశోర్, సంయుక్తా విశ్వనాథన్ స్పై రోల్స్ చేశారు. వాళ్లకు బాస్ రోల్ మురళీ శర్మ చేశారు. కథలో ఆయనది కీలక పాత్ర” అని చెప్పారు.

చిత్ర నిర్మాత అదితి సోనీ మాట్లాడుతూ ”స్పై జానర్ సినిమాల్లో ‘చారి 111’ కొత్తగా ఉంటుంది. ‘వెన్నెల’ కిశోర్ గారి నటన, టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం సినిమాకు హైలైట్ అవుతాయి. మార్చి 1న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అతి త్వరలో ట్రైలర్, పాటలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని చెప్పారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ‘చారి 111’ పాటలు విడుదల కానున్నాయి.

‘వెన్నెల’ కిశోర్, సంయుక్తా విశ్వనాథన్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, ‘తాగుబోతు’ రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఎడిటింగ్ : రిచర్డ్ కెవిన్ ఎ, స్టంట్స్ : కరుణాకర్, ప్రొడక్షన్ డిజైన్ : అక్షత బి హొసూరు, పీఆర్వో : పులగం చిన్నారాయణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బాలు కొమిరి, సాహిత్యం : సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి, సినిమాటోగ్రఫీ : కషిష్ గ్రోవర్, సంగీతం : సైమన్ కె కింగ్, నిర్మాణ సంస్థ : బర్కత్ స్టూడియోస్, నిర్మాత : అదితి సోనీ, రచన, దర్శకత్వం : టీజీ కీర్తీ కుమార్.
#Chaari111

Previous Post

విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ‌కు ఢిల్లీలో గ‌ళ‌మెత్తిన జేడీ

Next Post

ఫిబ్రవరి 16న “ఐ హేట్ లవ్ ” విడుదల

Next Post
ఫిబ్రవరి 16న “ఐ హేట్ లవ్ ” విడుదల

ఫిబ్రవరి 16న “ఐ హేట్ లవ్ " విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’
movies

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

by admin
July 6, 2026
0

...

Read more
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

July 4, 2026
రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

June 19, 2026
హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

June 13, 2026
‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

June 12, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

June 11, 2026
“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

May 31, 2026
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In