• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో ‘’భవదీయుడు భగత్ సింగ్”

admin by admin
September 9, 2021
in movies
0 0
0
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో ‘’భవదీయుడు భగత్ సింగ్”
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘’భవదీయుడు భగత్ సింగ్”
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ చిత్రం పేరిది. విజయవంతమైన చిత్రాల కథానాయకుడు, దర్శకుడు కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ నిర్మిత మయ్యే చిత్రాలపై అంచనాలు ఎప్పుడూ అధికంగానే ఉంటాయి. వీటిని మరోసారి నిజం చేసేలా టాలీవుడ్ అగ్రకథానాయకుడు పవన్ కళ్యాణ్ , ప్రముఖ యువ దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ ‘’భవదీయుడు భగత్ సింగ్” చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్రం పేరును ఈ రోజు ఉదయం 9.45 నిమిషాలకు అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు చిత్ర దర్శక,నిర్మాతలు.

‘’భవదీయుడు భగత్ సింగ్” ప్రచార చిత్రాన్ని నిశితంగా గమనిస్తే ….’ ఆధునిక వాహనం పై కథానాయకుడు పవన్ కళ్యాణ్ జీన్స్, జర్కిన్ వస్త్ర ధారణలో ఓ చేతిలో టీ గ్లాస్,మరో చేతిలో స్పీకర్. స్టైలిష్ గా కూర్చొని ఉండటం కనిపిస్తుంది.
‘భవదీయుడు’ అన్న పదం వినయం, విధేయత గా అనిపిస్తే…
‘భగత్ సింగ్’ విప్లవ చైతన్యానికి మారుపేరు గా స్ఫురిస్తుంది.
ఈ రెండింటినీ కలిపి ఈ చిత్రానికి ‘భవదీయుడు భగత్ సింగ్’ అని పెట్టడంలో దర్శకుడు ఆంతర్యమేమిటి…?
ఈ చిత్రం ఓ లేఖ అయితే.. ‘భవదీయుడు భగత్ సింగ్’ అనేది ఓ సంతకం అయితే…..
ఈ లేఖలో ఏం రాశారు, ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెప్పబోతున్నారు, అన్నీ ఆసక్తిని, ఆలోచనలు రేకెత్తించేవే….
చిత్రంలో సామాజిక అంశాల ప్రస్తావన
తప్పని సరా ? కథాబలం,సన్నివేశాలలో భావోద్వేగాలు, పాత్రలమధ్య సంఘర్షణ, తూటాల్లాంటి మాటలు ఈ చిత్రం స్వంతమా ..?అనిపిస్తుంది. ఖచ్చితంగా ‘భవదీయుడు భగత్ సింగ్’ వెండితెరపై ఓ చెరగని సంతకం అనిపిస్తుంది.

ఇవన్నీ ఒకెత్తు అయితే ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు మరోసారి అభిమాన ప్రేక్షకులను నిస్సందేహంగా ఉర్రూతలూగించనున్నాయి. ఒకటేమిటి మరెన్నో విశేషాలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానున్నాయి. ఒక్కొక్కటిగా సందర్భాన్ని బట్టి ప్రకటించనున్నారు. ఒక డైనమైట్ లాంటి హీరో మీద, మరో డైనమైట్ లాంటి పేరు పెట్టి చిత్రం మీద ఉత్సుకతను, అంచనాలను మరింతగా పెంచారు చిత్రం మేకర్స్. “దిస్ టైం ఇట్స్ నాట్ జస్ట్ ఎoటర్ టైన్ మెంట్” అని ప్రచార చిత్రం లో కనిపించే అక్షరాలు అక్షరాల నిజం అనిపించేలా ” ‘’భవదీయుడు భగత్ సింగ్” ఉండబోతోంది.
ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది అని తెలుపుతూ తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అన్న విషయాన్ని స్పష్టం చేశారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్

ఈ చిత్రానికి అయనాంక బోస్ ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తున్నారు. కళా దర్శకుడు గా ఆనంద సాయి, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్, పోరాటాలు రామ్ లక్ష్మణ్ ఇప్పటివరకు ఎంపిక అయిన ప్రధాన సాంకేతిక నిపుణులు.

Previous Post

కొవిడ్‌ నిబంధనల మేరకు గణేశ్‌ ఉత్సవాలు: ఏపీ హైకోర్టు

Next Post

పేదలకు దక్కాల్సిన రేషన్ కొందరు ధనికవర్గ పెద్దలు తింటున్నారు ; మంత్రి పేర్ని నాని

Next Post
పేదలకు దక్కాల్సిన రేషన్ కొందరు ధనికవర్గ పెద్దలు తింటున్నారు ; మంత్రి పేర్ని నాని

పేదలకు దక్కాల్సిన రేషన్ కొందరు ధనికవర్గ పెద్దలు తింటున్నారు ; మంత్రి పేర్ని నాని

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్
movies

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

by admin
October 3, 2026
0

...

Read more
సీనియర్ దర్శకుడు  బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

సీనియర్ దర్శకుడు బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

October 3, 2026
‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

October 2, 2026
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In