నిన్నటి ఉపరితల ఆవర్తనం ప్రస్తుతము ఉత్తర బంగాళాఖాతం,దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుండి 4.5 కిలో మీటర్ల వరకు విస్తరించిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడి.
ఎత్తుకు వెళ్ళే కొద్దీ నైఋతి దిశ వైపుకు వంగి కొనసాగుతోందని వివరణ.
దీని ప్రభావంతో రాగల 24 గంటలలో ఉత్తర, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగళాఖాతంలో ఒక అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది.
ఈరోజు షీర్ జోన్ (ద్రోణి) సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల నుండి 7.6 కిలోమీటర్ల మధ్య కొనసాగుతోందని, వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొన్న అధికారులు.
ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.