• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేతుల మీదుగా ‘దర్జా’ రెండో పాట విడుదల

admin by admin
April 11, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రం టీజర్‌ని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, మొదటి పాటను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఇటీవలే ఆవిష్కరించారు. అవి ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకున్నాయి. తాజాగా చిత్రంలోని రెండో పాటని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘ ‘దర్జా’ చిత్రంలోని రెండో పాటను విడుదల చేయడం జరిగింది. పాట చాలా బాగుంది. ఈ పాట చూస్తుంటే సినిమా చాలా గ్రాండ్‌గా తెరకెక్కినట్లుగా తెలుస్తుంది. చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్. ఈ చిత్రం పెద్ద సక్సెస్ అయ్యి, యూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు కామినేని శ్రీనివాస్, చిత్ర నిర్మాత శివశంకర్ పైడిపాటి, కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటితో పాటు స్ర్కిఫ్ట్‌ కో-ఆర్డినేటర్ పురుషోత్తపు బాబీ, సంగీత దర్శకుడు రాప్‌రాక్ షకీల్, ప్లేబాక్ సింగర్ మౌష్మి నేహా,రైటర్ భవానీ ప్రసాద్, ఆర్టిస్ట్ సమీర్ తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటి మాట్లాడుతూ.. ‘‘మా ‘దర్జా’ చిత్రంలోని సెకండ్ సింగిల్‌ని విడుదల చేసి, ఆశీస్సులు అందించిన ఎస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌గారికి మా టీమ్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇటీవల టీజర్‌ని నిర్మాత సురేష్ బాబుగారు, ఫస్ట్ సింగిల్‌ని దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావుగారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న కామినేని శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. త్వరలోనే ‘దర్జా’ విడుదల వివరాలను తెలియజేస్తాము..’’ అని అన్నారు.

సునీల్, అనసూయ, ఆమని, పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), శిరీష, షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, నాగ మహేష్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, సమీర్, రామ్ సర్కార్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి…
కెమెరా: దర్శన్,
సంగీతం: రాప్ రాక్ షకీల్,
ఎడిటర్: ఎమ్.ఆర్. వర్మ,
కథ: నజీర్,
మాటలు: పి. రాజేంద్రకుమార్, నజీర్, భవానీ ప్రసాద్,
ప్రొడక్షన్ డిజైనర్ : బందర్ బాబీ,
స్ర్కిఫ్ట్ కో-ఆర్డినేటర్: పురుషోత్తపు బాబీ,
పీఆర్ఓ: బి. వీరబాబు,
కో & ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: రవి పైడిపాటి,
నిర్మాత: శివశంకర్ పైడిపాటి,
స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సలీమ్ మాలిక్.

Previous Post

పేద పిల్లల కోసం సినీతారల చారిటీ క్రికెట్ మ్యాచ్

Next Post

“రెడ్డిగారింట్లో రౌడీయిజం” సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు- హీరో ర‌మ‌ణ్

Next Post

"రెడ్డిగారింట్లో రౌడీయిజం" సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు- హీరో ర‌మ‌ణ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

సన్ ఆఫ్ మూవీ రివ్యూ: కట్టిపడేసే తండ్రీకొడుకుల బంధం
movies

సన్ ఆఫ్ మూవీ రివ్యూ: కట్టిపడేసే తండ్రీకొడుకుల బంధం

by admin
February 28, 2026
0

...

Read more
పేలుడులో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం- సీఎం చంద్రబాబు

పేలుడులో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం- సీఎం చంద్రబాబు

February 28, 2026
హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

February 28, 2026
యూత్‌ఫుల్ లవ్ డ్రామాతో  హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై ప్రెస్టేజీయస్  ప్రాజెక్ట్ ప్రారంభం

యూత్‌ఫుల్ లవ్ డ్రామాతో హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై ప్రెస్టేజీయస్ ప్రాజెక్ట్ ప్రారంభం

February 28, 2026
హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

February 28, 2026
రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

February 28, 2026
KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు..100 కోట్ల డాల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌

KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు..100 కోట్ల డాల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌

February 28, 2026
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్

February 28, 2026
సుహాసిని, వినోద్ కుమార్ ఆవిష్కరించిన ‘ఓ మాట అనుకుందామా!’ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్!

సుహాసిని, వినోద్ కుమార్ ఆవిష్కరించిన ‘ఓ మాట అనుకుందామా!’ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్!

February 27, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In