హీరో నాగచైతన్య చేతుల మీదుగా ప్రారంభమైన సాయి రత్న క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2
బొమ్మ దేవర శ్రీదేవి సమర్పణలో సాయి రత్న క్రియేషన్స్ పతాకంపై తేజ్ బొమ్మ దేవర, రిషిక లోక్రే జంటగా బొమ్మ దేవర రామచంద్ర రావు దర్శక, నిర్మాణ సారద్యంలో తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన హీరో నాగ చైతన్య హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా..ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ రాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు .స్క్రిప్ట్ ఏ. సి .యస్ కిరణ్ అందించారు దర్శకుడు సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో
చిత్ర దర్శక,నిర్మాత బొమ్మ దేవర రామచంద్ర రావు మాట్లాడుతూ.. మేము పిలవగానే వచ్చిన హీరో నాగ చైతన్య కు, సి కళ్యాణ్, సముద్ర గార్లకు, మరియు నాకు ఈ సినిమా చేసే అవకాశం కల్పించిన నాగార్జున గారికి ధన్యవాదములు. నాకు మంచి యూనిక్ ఉన్న సబ్జెక్టు లభించడంతో ఈ సినిమా చేస్తున్నాను. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథలకు భిన్నంగా ఈ కథ ఉంటుంది. ఈ చిత్రం ద్వారా హీరో గా పరిచయమవుతున్న మా అబ్బాయిని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ నెల 10 నుండి 21వ తేదీ వరకు మొదటి షెడ్యూల్ చేసుకుని జులై ఫస్ట్ నుండి అరకు లో మిగిలిన షూటింగ్ జరుపుకుని సెప్టెంబర్ లో షూటింగ్ పూర్తి చేసుకొని అదే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. ఇందులో రాజు సుందరం అద్భుతమైన స్టెప్స్ అందిస్తున్నాడు. మంచి ఆర్టిస్టులు టెక్నిషియన్స్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఏంటర్ టైన్ చేస్తుంది అన్నారు.
చిత్ర హీరో తేజ్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి సినిమా అంటే ప్యాషన్, మా నాన్న గారు నన్ను ఫోర్స్ చేయలేదు. నీకు ఏది ఇష్టమో అది చేయమన్నారు. నాకు నటనపై ఆసక్తి ఉండడంతో సినిమాకు కావాల్సిన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్ని నేర్చుకొని నా ఇంట్రెస్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథలకు భిన్నమైన చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. నేను చేస్తున్న ఈ మొదటి చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన రవి కె. మాట్లాడుతూ.. ఇది మంచి యూనిక్ సబ్జెక్టు.ఈ కథ మీద నేను గత ఆరు నెలలుగా జర్నీ చేస్తున్నాను.ఈ సినిమా కొరకు హీరో ప్రత్యేకంగా తనకు తాను మౌల్డ్ చేసుకున్నాడు.
మాటల రచయిత సుదర్శన్ మాట్లాడుతూ..నాకింత మంచి అవకాశం ఇచ్చిన చంద్ర గారికి ధన్యవాదములు
ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారందరూ మంచి సబ్జెక్టు తో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలని అన్నారు.
నటీ నటులు
తేజ్ బొమ్మ దేవర,రిషిక లోక్రే,జయ ప్రకాష్, శైలజా ప్రియ, మెకా రామకృష్ణ,నవీన్ నేని, రవి శివ తేజ,మాస్టర్ అజయ్,అంజలి, శ్రీ లత తదితరులు
సమర్పణ : బొమ్మ దేవర శ్రీదేవి
బ్యానర్ : సాయి రత్న క్రియేషన్స్,
రచన దర్శకత్వం : చంద్ర
నిర్మాత : బొమ్మ దేవర రామచంద్ర రావు
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : వాసు
సంగీతం : వికాస్ బాడిస
ఎడిటింగ్ : ఉద్దవ్ ఎస్ బి
మాటలు : బి సుదర్శన్
కొరియోగ్రఫీ : రాజు సుందరం
పాటలు : శ్రీమణి, అనంత శ్రీరామ్, శ్రీ సిరాగ్
కో డైరెక్టర్ : వాయుపుత్ర
పి . ఆర్. ఓ : పర్వతనేని రాంబాబు, సాయి సతీష్
పబ్లిసిటీ డిజైనర్ : డ్రీమ్ లైన్
ఎక్సగ్యూటివ్ ప్రొడ్యూసర్ : మానుకొండ మురళీకృష్ణ
Hero Naga Chaitanya Attends The Launching of Sai Ratna Creations Production No 2
Senior make-up man Bommadevara Ramachandra Rao aka Chandra who worked with many actors including Anushka made his debut as producer with Panchakshari which was released in 2010. Now, Chandra is debuting as director to introduce his son Tej Bommadevara as hero. Besides directing, Chandra will also be producing the movie under Sai Ratna Creations banner as Production No 2, while Bommadevara Sridevi Presents it. Rishika Lokre is the leading lady.
The movie has been launched today grandly in presence of some Tollywood biggies. For the muhurtham shot on the lead pair- Tej Bommadevara and Rishika Lokre, hero Naga Chaitanya who graced the event as the chief guest sounded the clapboard, while art director Srinivas Raju switched on the camera. Senior director Samudra did honorary direction. ACS Kiran handed over the script to the makers.
Later, while addressing the media, producer-director Chandra said, “I thank Naga Chaitanya, C Kalyan and V Samudra who graced the occasion. My special thanks to Annapurna Studios for all their support. I wish you all will lend support for my son Tej who’s debuting as hero. The film’s story is completely different from the regular love stories. We’ll be making the movie on uncompromised manner with good budget and rich production values. The film’s regular shoot commences from 10th of this month. We are planning to release it in September.”
Hero Tej said, “I’ve passion for cinema since my childhood. I took training in acting, dances and fights with my own interest. I wish the audience will support and bless my first movie.”
Vasu is the cinematographer of the movie, while Vikas Badisa renders soundtracks. Uddhav SB is the editor, while top choreographer Raju Sundaram and Brinda masters oversee choreography.
Cast: Tej Bommadevara, Rishika Lokre, Jaya Prakash, Shailaja Priya, Meka Ramakrishna, Naveen Neni, Ravi Shiva Tej, Master Ajay, Anjali, Sri Latha etc.
Technical Crew:
Presents: Bommadevara Sridevi
Banner: Sai Ratna Creations
Writer, Director, Producer: Bommadevara Ramachandra Rao (Chandra)
DOP: Vasu
Music: Vikas Badisa
Editing: Uddhav SB
Dialogues: B Sudarshan
Choreography: Raju Sundaram, Brinda
Lyrics: Sreemani, Anantha Sriram, Sri Sirag
Co-Director: Vayuputra
PRO: Rambabu Parvataneni, Sai Satish
Publicity Designer: Dreamline
Executive Producer: Manukonda Muralikrishna