టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కనున్న నూతన చిత్రం ‘KA14’ (రికార్డ్) పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
వీర కోగటం ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, వంశీ నందిపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.గ్రాండ్ పూజా కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తొలి క్లాప్ కొట్టారు.దర్శకుడు సుకుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.









