ఈనెల ఏప్రిల్ 28 న “మంగళవారం” అగ్ర నటి బాయ్ ఫ్రెండ్ నటించిన “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్ లాంచ్
హేమంత్ ఇప్పనపల్లి కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా అయినా భారతదేశంలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మక వి ఎఫ్ ఎక్స్ సినిమాగా నిర్మించబడుతున్న “ఫస్ట్ టైం” సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఈనెల 28న “మంగళవారం” అగ్ర నటి చేతుల మీదగా ట్రైలర్ లాంచ్ జరగనుంది. ఈ సినిమాలో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతుండగా ‘బిగ్ బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ గా అనిక్క విక్రమన్ హీరోయిన్ గా, ఇతర ముఖ్య పాత్రల్లో మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు నటిస్తున్నారు. శ్రీ వెంకట్ మరియు సూరజ్ ఎస్ కురుప్ సంగీతాన్ని అందించగా వేణు మురళీధర్ మరియు రామ్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు.
చెప్పుకోడానికి చిన్న బడ్జెట్ సినిమా అయినా టెక్నికాలిటీస్, విజువల్స్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా గ్రాండ్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు హేమంత్ ఇప్పనపల్లి. AI ని ఎక్కడ ఇన్వాల్వ్ చేయకుండా HI( హ్యూమన్ ఇంటలిజెన్స్) తో హై రేంజ్ గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈనెల 28న “మంగళవారం” అగ్ర నటి చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు.
నటీనటులు :
సౌరబ్ ధింగ్ర హీరోగా, అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ గా అనిక్క విక్రమన్ హీరోయిన్ నటిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు నటిస్తున్నారు.
సాంకేతిక వర్గం :
రచయిత ఎడిటర్ విఎఫ్ఎక్స్ లీడ్ నిర్మాత మరియు దర్శకుడు : హేమంత్ ఇప్పనపల్లి
సంగీతం : శ్రీ వెంకట్ మరియు సూరజ్ ఎస్ కురుప్
సినిమాటోగ్రఫీ : వేణు మురళీధ మరియు రామ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి. రాజశేఖర్
పి ఆర్ ఓ : ఎస్ నాగేశ్వరరావు (ఎస్ ఎన్ ఆర్)
మార్కెటింగ్ పార్టనర్ : పుష్యమి మీడియా
పబ్లిసిటీ డిజైనర్ : వెంకట్ మజ్జి









