టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఇంటివద్ద విలేకర్ల సమావేశం జరిగింది.. ఈ సమావేశంలొ బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆంధ్ర ప్రదేశ్ లో కల్తీ మధ్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు,గతంలో రాష్ట్రం లో మద్యం ఏరులై పారుతుందని జగన్ గొంతు చించుకున్నాడు.. ఆనాడు సొంత మీడియాలో టిడిపి పై అక్కసు వెళ్లగక్కారు అన్నారు.. 2019 ఎన్నికల సమయంలో దశల వారీగా మద్యం రద్దు చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఆ హామీలు ఈనాడు గాలికి వదిలేసి రెండున్నరేళ్ల జగన్ పాలనలో మద్యం ఏరులై పారుతుంది అన్నారు. బ్రాండ్ లను మార్చి మరీ.. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు అన్నారు.. జె బ్రాండ్ లు తెచ్చి డమ్మీ బ్రాండ్ లతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అని ధ్వజమెత్తారు.. దేశంలో ఎక్కడైనా ఈ బ్రాండ్ లు ఎవరైనా చూశారా అని ప్రశ్నించారు.. ఏ ప్రాంతంలో అయినా వైసిపి నేతల కనుసన్నల్లోనే మద్యం రవాణా అవుతుంది.. నిబంధనలు పాటించకుండా నాసి రకం మద్యం తయారు చేయించి అమ్ముతున్నారు అని, పాతికేళ్లకు చనిపోయే వాళ్లు… పదేళ్ల ముందే చనిపోతారు అన్నారు.. ఈ పిచ్చి మందు వల్ల రెండేళ్లల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.. కానీ ఆ చావులను కరోనా మరణాల లెక్కల్లో వేసి… ప్రభుత్వం తప్పించుకుంది అన్నారు, ఇరవై రూపాయల మందును రెండు వందలకు అమ్ముతూ ycp నేతలు జెబులు నింపుకుంటున్నారు అన్నారు.. దమ్ముంటే వీటి ఇన్ వాయిస్ వివరాలను బహిర్గతం చేయాలి అన్నారు, ఈ మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి ఎంత, వైసిపి నేతల జేబుల్లోకి ఎంత వెళుతుందో లెక్కలు మా దగ్గర ఉన్నాయి అని తెలిపారు.. బూం బూం బీరు వైసిపి నేతల సొంత తయారీ… ఎపి తప్ప ఎక్కడా ఇది దొరకదు అన్నారు.. పిచ్చి మందులన్నీవైసిపి నేతల ఆధ్వర్యంలో తయారవుతున్నాయి, కాయ కష్టం చేసి… జె బ్రాండ్ పిచ్చి మందు కొడితే… తెల్లారేసరికి ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నారు.. నేడు తాజాగా 700 షాపులను వాక్ ఇన్ స్టోర్స్ పేరుతో వైసిపి నాయకులకు కట్ట బెట్టారు.. హోటల్స్, రెస్టారెంట్ లను మించి ఈ షాపులు దర్శనమిస్తున్నాయి.. దశల వారీ మద్య నిషేధం అంటే ఈ పిచ్చి మందులు అమ్మడమా అని ప్రశ్నించారు.. నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం తెచ్చి అమ్మడమా మధ్యం నిషేధం అంటే..?రాబోయ15 సంవత్సరాలలో వచ్చే మద్యం ఆదాయం చూపి 25వేల కోట్లు అప్పులు తెచ్చాడు ఈ ముఖ్యమంత్రి.. జగన్ కు వచ్చిన ఇటువంటి ఐడియా దేశంలో ఎవరికీ వచ్చి ఉండదు.. మరి ఇక రాష్ట్రం లో మద్య నిషేధం ఎక్కడో జగన్ చెప్పాలి అన్నారు.. ఇప్పుడు మరో 25వేల కోట్లు తేవాలని ప్రయత్నం చేస్తున్నారు అని, మద్యం తాగే ప్రతి వ్యక్తి తలకాయ తాకట్టు పెట్టి అప్పులు తేవడం ఇప్పుడే చూస్తున్నాం అన్నారు, మద్యం అమ్మకాల అవినీతి ద్వారా యేడాదికి ఆరు వేల కోట్లు వైసిపి నేతల జేబుల్లోకి వెళ్లాయి.. ఇప్పటికే పేదలు పిచ్చి మందు తాగి ప్రాణాలు కోల్పోతున్నారు ఇప్పుడు ఇంకా వాక్ ఇన్ స్టోర్స్ అని పెట్టడానికి ప్రభుత్వానికి సిగ్గుండాలి..రాబోయే రోజుల్లో కొత్తగా జగనన్న మద్యం డోర్ డెలివరీ పధకాన్ని అమలు చేయబోతున్నారు అన్నారు. మహిళలు మీ మాటలు నమ్మి ఓట్లేస్తే.. ఆంధ్ర ప్రదేశ్ ను మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారు.. పిచ్చి మందులకు,జె బ్రాండ్ లకు కేరాఫ్ అడ్రెస్ ఎపి గా మార్చారు.. ప్రభుత్వం మాటలు నమ్మి రుణాలు ఇస్తే బ్యాంకులు కూడా బుక్ అయిపోతాయి.. తక్షణమే వీటన్నింటి పై ప్రభుత్వం స్పందించి సమాధానం చెప్పాలి అని ఇప్పుడు అమ్మే కల్తీ మద్యాన్ని నిలిపి వేసి ప్రజల ప్రాణాలను రక్షించాలని డిమాండ్ చేశారు.