• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

షాహిద్ కపూర్ నెక్స్ట్ సినిమా… అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్

admin by admin
March 20, 2024
in movies
0 0
0
షాహిద్ కపూర్ నెక్స్ట్ సినిమా… అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

మన పురాణాల్లోని అద్భుతమైన పాత్రను ఈ ఆధునిక యుగానికి పరిచయం చేసేందుకు, థ్రిల్లింగ్ జర్నీని ప్రేక్షకులను ఇచ్చేందుకు పూజా ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధమవుతోంది. షాహిద్ కపూర్ హీరోగా.. ఈ మాగ్నమ్ ఓపస్‌ను సచిన్ రవి తెరకెక్కిస్తున్నారు. ఊహకు, వాస్తవాలకు మధ్య ఉండే అద్భుతమైన కథను, గాధను ‘అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్’ చూపించబోతోన్నారు. ‘అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్’ అనే ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ ఇలా ఐదు భాషల్లో రానుంది.

ఈ చిత్రం మహాభారతంలోని చిరంజీవి అయిన ఓ యోధుడు (అశ్వత్థామ) కథను చెప్పబోతోంది. ఇప్పటికీ అశ్వత్థామ బతికే ఉన్నారని నమ్ముతుంటారు. వేగవంతమైన సాంకేతిక పురోగతులు, అద్భుతమైన సామర్థ్యాలతో పరిగెడుతున్న ఈ ప్రస్తుత యుగంలో, అశ్వత్థామ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడు అనేది చూపించబోతోన్నారు. హై యాక్షన్ ప్యాక్డ్ సీన్లతో సినిమాను అద్భుతంగా తీర్చి దిద్దబోతోన్నారు. అమర జీవిగా ఇన్ని వేల సంవత్సరాలు ఎలా బతికి ఉన్నాడు అనే పాయింట్‌ను కూడా చూపించబోతోన్నారు.

ఇది గతం, వర్తమానం మధ్య జరిగే యుద్దం అని చెప్పుకొచ్చారు. ఈ సీన్లు రోమాలు నిక్కబొడుచుకునేలా తెరకెక్కిస్తామని చెబుతున్నారు. నిర్మాత జాకీ భగ్నాని మాట్లాడుతూ.. “మేము చేపట్టే ప్రతి ప్రాజెక్ట్ కేవలం వినోదం మాత్రమే కాదు.. ప్రేక్షకులకు మరిచిపోలేని ఓ అద్భుతమైన అనుభవాన్ని ఇవ్వాలని ప్రయత్నిస్తాం. ప్రేక్షకుల హృదయాలు, మనస్సులపై శాశ్వత ప్రభావాన్ని చూపించేలా ఉండాలని చూస్తాం. బడే మియా చోటే మియా తర్వాత, నేను ఊహించని సినిమా చేయాలనుకున్నాను. ఇది మనందరికీ తెలిసిన కథ. ఈ కథపై ప్రస్తుత ఆధునిక కాల పరిస్థితులు, వాటి వల్ల ఆ లెజెండ్ చేయాల్సి వచ్చిన యుద్దం ఏంటన్నది ప్రేక్షకులు మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది’ అని అన్నారు.

దర్శకుడు సచిన్ రవి మాట్లాడుతూ.. “నాకు అమరత్వం అనేది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇందులో చాలా భావోద్వేగాలు, నాటకీయ దృశ్యాలను రేకెత్తించే ఆస్కారం ఉంటుంది. మహాభారతంలోని అశ్వత్థామ ఈనాటికీ జీవిస్తున్నాడని నమ్ముతుంటారు. అతను అమరజీవి అని భావిస్తుంటాం. అతని కథనాన్ని లోతుగా పరిశోధించాలనే నా కోరికకు ఆజ్యం పోసింది. నా లక్ష్యం ఈ కథకు ప్రాణం పోసి, ప్రస్తుత కాలక్రమంలో అతనిని ఉంచడం.. అమర జీవి యొక్క సంక్లిష్టమైన మనస్తత్వం ఎలా ప్రభావితం అవుతుంది.. అతను వేల సంవత్సరాలుగా చూసిన ప్రపంచాన్ని అతను ఎలా గ్రహించాడో అన్వేషించడం అనే పాయింట్స్ ఆసక్తికరంగా ఉంటాయి. నేను అతని కథను భారీ ఎత్తున, మునుపెన్నడూ చూడని యాక్షన్ చిత్రంగా మల్చాలని ప్రయత్నిస్తున్నాను’ అని అన్నారు.

పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వాషు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్షికా దేశ్‌ముఖ్‌లు నిర్మించారు. సచిన్ రవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే థియేటర్‌లలో విడుదల కానుంది.

Previous Post

“మగధీర” రీ-రిలీజ్ కు సిధ్ధం

Next Post

ధనుష్ ప్రధాన పాత్రలో ‘ఇళయరాజా’ బయోపిక్ ప్రారంభం

Next Post
ధనుష్ ప్రధాన పాత్రలో ‘ఇళయరాజా’ బయోపిక్  ప్రారంభం

ధనుష్ ప్రధాన పాత్రలో ‘ఇళయరాజా’ బయోపిక్ ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్
movies

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

by admin
September 6, 2026
0

...

Read more
ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

September 5, 2026
టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన  “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

September 5, 2026
పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

September 4, 2026
Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

September 4, 2026
అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

September 4, 2026
మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

September 3, 2026
ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

September 3, 2026
ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

September 1, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In