ఔట్ & ఔట్ ఫన్నీ కామెడీ ఎంటర్ట్ టైనర్ “సాఫ్ట్ వేర్ బ్లూస్”
◆ ఈ నెల 31 న గ్రాండ్ రిలీజ్
◆ సాఫ్ట్ వేర్ కు సంబంధం లేని వారికి కూడా మా “సాఫ్ట్ వేర్ బ్లూస్” నచ్చుతుంది.దర్శకుడు ఉమా శంకర్
శ్రీరాం, భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్.రాజు, బస్వరాజ్ నటీనటులుగా ఉమాశంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మిస్తోన్న చిత్రం “సాఫ్ట్ వేర్ బ్లూస్”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 31 న విడుదల చేస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది* .*
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ … నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ని, సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న వారి కష్టాలు ఎలా ఉంటాయి. వారికిచ్చిన టార్గెట్స్, టాస్క్స్ పూర్తి చేసే క్రమంలో వారు పడుతున్న టెన్షన్స్ ను తెలుపుతూ ఔట్ & ఔట్ ఫన్నీ కామెడీ ఎంటర్ట్ టైన్ గా ఈ మూవీ రూపొందించడం జరిగింది. చాలా న్యాచురల్ కైండ్ ఆఫ్ కామెడీతో ఈ సినిమా నడుస్తోంది.ఇందులో నటించిన వారెవరూ సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కాకున్నా డెడికేషన్ తో వర్క్ చేశారు..హీరో హీరోయిన్స్ చాలా చక్కటి పెర్ఫార్మన్స్ ఇచ్చారు., టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. సంగీత దర్శకుడు ఈ మూవీకి చక్కటి మ్యూజిక్ అందించాడు. ప్యాండమిక్ స్విచ్వేషన్ వల్ల మేము ఈ సినిమాను విడుదల చేయలేకపోయాము. మా కొలీగ్స్ సపోర్ట్ వల్ల సినిమాను కంప్లీట్ చేశాము. మాకిప్పుడు సరైన డేట్ కుదిరింది…డిస్ట్రిబ్యూటర్ ఠాగూర్ సపోర్ట్ తో డిసెంబరు 31 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న ఈ సినిమా అందరికీ తప్పక నచ్చుతుందని అన్నారు.
సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ వి.కె రాజు మాట్లాడుతూ.. చక్కటి కథను సెలెక్ట్ చేసుకొన్న దర్శకుడు ఉమా శంకర్ సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ గా తెరకెక్కించాడు.ఇందులో పాటలు చాలా బాగున్నాయి. “సాఫ్ట్ వేర్ బ్లూస్” .ఈ సినిమా చూసిన వారందరి కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. మాకు సపోర్ట్ చెయ్యడానికి ముందుకు వచ్చిన ఠాగూర్ గారికి ధన్యవాదాలు ఈ నెల 31 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు
నటుడు మహబూబ్ బాషా మాట్లాడుతూ.. సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మొట్ట మొదటి సినిమా “సాఫ్ట్ వేర్ బ్లూస్”. ఇందులో నా క్యారెక్టర్ చాలా ఫన్ క్రియేట్ చేస్తుంది.సాఫ్ట్ వేర్ కు సంబంధం లేని వారికి కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఓటిటి లో రిలీజ్ చేయమని ఎన్నో ఆఫర్స్ వచ్చినా సినిమాపై ఉన్న కాన్ఫిడెంట్ తో థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. మా సినిమా నచ్చి మమ్మల్ని సపోర్ట్ చెయ్యడానికి ఠాగూర్ గారు ముందుకు వచ్చి ఈ సినిమాను విడుదల చేస్తున్న తనకు ధన్యవాదాలు.ఈ నెల 31 న వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు
హీరో శ్రీరాం మాట్లాడుతూ.. అందరూ సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ అంటే లగ్జరీ జీవితం అనుకుంటారు. చిత్ర దర్శకుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేస్తూ తనకు వస్తున్న నాలుగు లక్షల జీతాన్ని వదులుకొని సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో సాధారణ ప్రజలకు ఉన్నట్లే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కు కష్టాలు వుంటాయని ఫుల్ ఔట్ ఔట్ కామెడీ ఏంటర్ టైన్మెంట్ లో అందరికి అర్థమయ్యేలా ఈ మూవీ జేయడం జరిగింది. తనకిది ఫస్ట్ మూవీ అయినా చాలా చక్కగా తీశాడు.ఈ సినిమా చూసిన వారందరికీ “సాఫ్ట్ వేర్ బ్లూస్” కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
హనీష్ మాట్లాడుతూ .. ప్రీమియర్ చూసిన వారంతా హ్యాపీడేస్ మూవీ లా ఉందని అంటుంటే చాలా సంతోషంగా ఉంది. దర్శక, నిర్మాతలు ఈ మూవీ కు చాలా కష్టపడ్డారు. ఓటిటి లో ఆఫర్ వచ్చినా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.ఈ సినిమా వారికి గొప్ప విజయాన్ని అందించాలని కోరుతున్నాను అన్నారు.
డిస్టిబ్యూటర్ ఠాగూర్ రాంప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రీమియర్ లో అందరూ చాలా బాగుందని ప్రశంసించారు. చక్కటి కథాంశంతో వస్తున్న ఈ సినిమాకు ఓటిటి లో ఆఫర్ వచ్చినా కూడా థియేటర్ లోనే విడుదల చేయాలని చెప్పడంతో వారి సహకారంతో ఈ నెల 31 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు.
హీరోయిన్ భావన మాట్లాడుతూ. .చక్కటి కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో ట్విస్ట్స్ & టర్న్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు చాలా ఉంటాయి.ఇది నాకు మొదటి చిత్రమైనా సెట్ లో నటీనటు లందరూ నాకు బాగా కో ఆపరేట్ చేశారు.ఈ సినిమాలో నేను సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు
సుబ్బానాయుడు మాట్లాడుతూ.. ఇందులో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు కుటుంబ సమేతంగా చూడతగ్గ సినిమా ఇది. మా సినిమాను ప్రేక్షకులందరికీ ఆదరించి పెద్ద హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
నటుడు శివకిరన్ గోవికర్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన తరువాత సాఫ్ట్ వేర్ లో కూడా ఇన్ని వేర్ కూడా ఇన్ని వేరేషన్స్ ఉంటాయా అని తెలుస్తుంది. ఇలాంటి మంచి చిత్రంలో నేను పార్ట్ అయ్యేలా నాకు అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
నటీ నటులు
శ్రీరాం, భావన ,ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్.రాజు, బస్వరాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి
సాంకేతిక నిపుణులు
నిర్మాతలు: సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్
కథ ,కథనం, దర్శకత్వం: ఉమాశంకర్
సంగీతం: సుభాష్ ఆనంద్,
సినిమాటోగ్రఫీ: నిమ్మ గోపి,
ఎడిటర్: వి.కె.రాజు,
పి.ఆర్. ఓ : మూర్తి