—వేలాది మంది కార్యకర్తలతో సింగనమల నియోజకవర్గం లో టీడీపీ శంఖారావం ర్యాలీ
–2024లో సీఎంగా చంద్రబాబును చేద్దాం
బుక్కరాయసముద్రం: వాళ్లు ఎప్పుడో టిక్కెట్ వచ్చి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కథ టిడిపి కార్యకర్తలు అంతు చూస్తామనడం కాదు…. మేము ఇప్పుడే రాండి సిద్ధమా… అంటూ సింగనమల నియోజకవర్గం ముంటిమడుగు కేశవరెడ్డి సంచలన ఆరోపణలు చేశాడు. సింగనమల నియోజకవర్గం లో ప్రతి గ్రామంలో ఇద్ధురు వెదవ నా కొడుకులు వలన పార్టీ కోసం పని చేసే కార్యకర్తలుకు నష్టం జరుగుతుంది. అలాంటి వాళ్లని కలప మొక్కల మాదిరి వేరేయాలంటే సింగనమల నియోజకవర్గంకు ఓ మంచి సరైన టిడిపి అభ్యర్థిని టిడిపి అధిష్టానం ఏర్పాటు చేయాలని ముంటిమలు కేశవరెడ్డి ఆరోపించారు. జగన్ అరాచక శక్తులపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం మద్దతుగా సింగనమల నియోజకవర్గం లో మంగళవారం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో సింగనమల నియోజకవర్గం శంఖారావం నిర్వహించారు. ఈ శంఖారావం కు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి వేలాదిమంది కార్యకర్తలు తరలివచ్చారు . ఈ శంఖారావం కు ముఖ్య అతిథులుగా దేశభ్ర కమిటీ సభ్యులు ఆలం నర్సా నాయుడు కేశవరెడ్డి తో పాటు రాష్ట్ర ఎస్సీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు, సింగనమల నియోజకవర్గం పార్టీ పరిశీలన గుర్రప్ప నాయుడు మాజీ జెడ్పిటిసి రామలింగారెడ్డి జిల్లా టిడిపి అధికార ప్రతినిధి శ్రీధర్ బాబు పలువురు టిడిపి నేతలు హాజరు కావడం జరిగింది. తొలుత బుక్కరాయసముద్రం మండలం తాసిల్దార్ కార్యాలయం నుంచి వేలాది మంది కార్యకర్తలతో బుక్కరాయసముద్రం ఆర్టీసీ బస్టాండు మెయిన్ బజార్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం పెద్దమ్మ గుడి వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు ప్రజలు హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో దిసభ్య కమిటీ సభ్యుడు కేశవరెడ్డి… సింగనమల నియోజకవర్గం లో ఆశావాహులైన పొగ టిడిపి నేతపై అవాకులు చవాకులు పేల్చారు. నియోజవర్గంలో కొంతమంది ఫ్యాక్షన్ అయ్యేందుకు గ్రామాల్లో ఆజ్యం పోస్తున్నారన్నారు. సింగనమల నియోజకవర్గం లో కొన్ని గ్రామాల్లో కక్షలు లేపేందుకు గ్రూపులు ఏర్పాటు చేసి పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారు అన్నారు. బాధ్యతగల పదవిలో ఉన్నాను కాబట్టి అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అని ఓర్పు సహనంతో ఉన్న… లేదంటే ఏమిటికైనా సిద్ధంగా ఉన్నానని హెచ్చరికలు జారీ చేశాడు.
కేసులు పెట్టే అభ్యర్థి మనకు అవసరమా….!
ప్రతిపక్షంలో ఉన్న టిడిపి కార్యకర్తలను ఏదైనా సమస్య వస్తే ఆదుకోవాల్సిందిపై… సొంత పార్టీ నేతలు కార్యకర్తలపై కేసులు పెట్టే అభ్యర్థి మనకు అవసరమా అంటూ బహిరంగ సభ వేదికపై నియోజవర్గ టిడిపి నాయకురాలు బండారు శ్రావణి పై పరోక్షంగా మాజీ జెడ్పిటిసి రామలింగారెడ్డి సంచలన ఆరోపణలు చేశాడు. ఈ ఒక్క మాట మాట్లాడడంతో సభకు విచ్చేసిన కార్యకర్తలు నేతలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున కేకలు వేస్తూ ఉత్సాహంగా మద్దతు పలికారు. నాలుగు సంవత్సరాలలో దిశబ్ద కమిటీ సభ్యులు నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ సూచించిన ఇంటింటా తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు, ప్రభుత్వంపై వ్యతిరేకంగా నిరసన ఆందోళనలో తదితర కార్యక్రమాలపై టూ మెన్ కమిటీ సభ్యులు దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. నియోజకవర్గంలో టిడిపి కుటుంబ సభ్యుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు… సామాన్య ప్రజలకు కావచ్చు… ఆర్థికంగా నష్టపోయిన, లేదా అనారోగ్య కారణాలతో మెరుగైన వైద్యం కోసం, పేదలకు వివాహాలు జరిగితే ఒక అన్నలా ఒక తమ్ముల్లు గా… ఆర్థిక సాయం ఇప్పటికే కోట్ల రూపాయలు ప్రజలకు సహాయం చేయ డం జరిగిందన్నారు. ఎన్నికల ముందు హడావిడి చేసే నేతలకు టికెట్ ఇవ్వడం అవసరమా… అని ప్రశ్నించారు. వేదికపై ఉన్న పార్టీ పరిశీలకులు గుర్రప్ప నాయుడుకు పార్టీకి సరైన అభ్యర్థిని ఎంపిక చేసే విధంగా మీరు చొరవ చూపాలని పార్టీ పరిశీలకు సూచించడం జరిగింది. సభా వేదికపై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు పరశురాం మాట్లాడుతూ… పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు నేతలపై టికెట్టు ఆశిస్తున్న బండారి శ్రావణి అక్రమంగా కేసులు పెట్టి వేధింపులకు గురి చేసిందన్నారు. అలాంటి నేతలు మనకి అవసరమా…. అని ప్రశ్నించారు. నియోజవర్గానికి టిడిపి ఇన్చార్జ్ లేకపోయినా ఇన్చార్జ్ అని ప్రకటిస్తూ… నాకే టికెట్టు వచ్చిందని తప్పుడు ప్రచారాలు చేసే వారిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ పరిశీలకు సూచించారు.