విజయవాడ సెంట్రల్ వైసీపీలో సీటు కోసం రగడ కొనసాగుతూనే ఉంది.
కొత్త ఇంచార్జి వెల్లంపల్లికి మల్లాది విష్ణు సహకరించనట్లు తెలుస్తోంది.
విజయవాడ సెంట్రల్ లో మల్లాది విష్ణు వర్సెస్ వెల్లంపల్లి శ్రీనివాస్ గా రాజకీయం మారుతున్నట్లు సమాచారం.
వెల్లంపల్లికి సహకారం ఉండదని ఇప్పటికే మల్లాది విష్ణు స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే విష్ణును పక్కన పెట్టి కార్యకర్తలతో వెల్లంపల్లి సమావేశాలు నిర్వహిస్తున్నారు.