• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

వైట్ హౌస్ కు రండమ్మా

admin by admin
November 27, 2023
in politics
0 0
0
వైట్ హౌస్ కు రండమ్మా
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

* మన బడి పిల్లలకు అమెరికా ఆహ్వానం

* నానోటెక్నాలజీ సదస్సుకు రమ్మని పిలుపు

* వచ్చే మార్చ్ 5న అంతర్జాతీయ సదస్సు

మన ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో చోటుచేసుకున్న మార్పులను విదేశాల్లో వివరించి అంతర్జాతీయ మేధావుల దృష్టిని ఆకర్షించిన మనబడి పిల్లలకు ఇప్పుడు మరో అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రసంగించి ఎందరో మేధావులను ఆకట్టుకున్న మన ప్రభుత్వ పాఠశాలన విద్యార్థులకు దేశవిదేశాల విద్యావేత్తలనుంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు వారికే మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం లభించింది. 2024 మార్చి 5న అమెరికాలో జరగనున్న నానో టెక్నాలజీ సదస్సుకు రావాల్సిందిగా మన విద్యార్థులకి ఆహ్వానం అందింది. ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, వ్యోమగాములతో పాటు అమెరికా అధ్యక్షుడు బైడెన్ సలహాదారు, భారత సంతతికి చెందిన ఆర్తి ప్రభాకర్‌తో మన విద్యార్థులు ఆ వేదికలో మాట్లాడే గొప్ప అవకాశం వారికి దక్కింది. ఆప్టిక్స్, విద్య, వైద్యం, ఉత్పత్తి, తయారీ రంగం,మైక్రో ఎలక్ట్రానిక్స్ వంటి అంశాలమీద విద్యార్థులు అక్కడ ప్రసంగిస్తారు.

*ఇప్పటికే పలు సదస్సుల్లో సత్తా చాటిన పేదింటి పిల్లలు*

రాష్ట్రంలో విద్య వ్యవస్థలో మొదలైన సంస్కరణలు, అవి సాధిస్తున్న ఫలితాలకు అభినందనలు, ప్రశంసలు దక్కడం ఇదే తొలిసారి కాదు. గత సెప్టెంబర్లో అమెరికాలో సుస్థిర అభివృద్ధి అనే అంశం మీద జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడ జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి సదస్సుల్లో పాల్గొని ఆయాదేశాల ప్రతినిధులతో కలిసి అక్కడి పాలనావిధానాలు, విద్య, ఆరోగ్యం వంటి కీలక అంశాలమీద ఆయా ప్రభుత్వాలు పెడుతున్న శ్రద్ధ, సమాజాభివృద్ధిలో ఆయా రంగాలు ఎలాంటి కీలకపాత్ర పోషిస్తాయి అనే అంశాలమీద చర్చలు.. విద్యావేత్తలు, ఆర్థిక, సామజిక వేత్తలతో భేటీలు నిర్వహించారు. పదిమంది విద్యార్థులు పదిహేను రోజులపాటు కొలంబియా , స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలతో పాటు న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం, ప్రపంచ బ్యాంకును సైతం సందర్శించి ఆయా దేశాల్లో పాలనా విధానం వంటి అంశాలమీద అవగాహన పెంపొందించుకున్నారు. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగంలో వచ్చిన గణనీయమైన మార్పులను, దానికోసం సీఎం వైయస్ జగన్ చేపట్టిన సంస్కరణలు గురించి వివరించారు. రాష్ట్రంలో అమ్మఒడి, మనబడి నాడు- నేడు, విద్యాకానుక వంటి పథకాలు విద్యావ్యవస్థను ఎంతగా బలోపేతం చేసిందీ పిల్లలు అక్కడి ప్రతినిధులకు వివరించారు. అంతేకాకుండా మన ప్రభుత్వం విద్యకోసం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించి అక్కడ మేధావుల మెప్పు పొందారు. తాజాగా ఇప్పుడు మరో సదస్సుకు పిలుపు రావడం అంటే మన ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలకు మరో గుర్తింపు వచ్చినట్లే.

Previous Post

“కలశ” మూవీ టిజర్‌ రిలీజ్‌ విడుదల

Next Post

‘షష్టిపూర్తి’ ఫస్ట్ లుక్ విడుదల

Next Post
‘షష్టిపూర్తి’ ఫస్ట్ లుక్ విడుదల

'షష్టిపూర్తి' ఫస్ట్ లుక్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం
movies

కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

by admin
March 21, 2026
0

...

Read more
ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

March 21, 2026
ఈసారి టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా… చింతకాయల విజయ్..!!!?

ఈసారి టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా… చింతకాయల విజయ్..!!!?

March 21, 2026
హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

March 20, 2026
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

March 20, 2026
వర్టెక్స్ 33 వెస్ట్‌లో గృహ కొనుగోలుదారులకు అద్భుతమైన అవకాశం

వర్టెక్స్ 33 వెస్ట్‌లో గృహ కొనుగోలుదారులకు అద్భుతమైన అవకాశం

March 20, 2026
మియాపూర్‌లో వర్టెక్స్ విరాట్  ప్రాజెక్ట్‌ అద్భుతమైన లిమిటెడ్ EMI హాలిడే ఆఫర్‌ ప్రకటించింది…

మియాపూర్‌లో వర్టెక్స్ విరాట్ ప్రాజెక్ట్‌ అద్భుతమైన లిమిటెడ్ EMI హాలిడే ఆఫర్‌ ప్రకటించింది…

March 20, 2026
రివ్యూ: పవన్ కళ్యాణ్ ​ “ఉస్తాద్ భగత్ సింగ్”

రివ్యూ: పవన్ కళ్యాణ్ ​ “ఉస్తాద్ భగత్ సింగ్”

March 19, 2026
‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ నుంచి ‘న్యాయం చేయరా దేవుడా..’ లిరికల్ విడుదల

‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ నుంచి ‘న్యాయం చేయరా దేవుడా..’ లిరికల్ విడుదల

March 18, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In