స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై నేడు సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ ఎస్ఎల్పీ దాఖలు చేయనుంది. ఈ కేసులో హైకోర్టు పరిధి దాటి వ్యవహరించిందని పిటీషన్ వేయనుంది. ట్రయల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాన్ని హైకోర్టు నిర్ధారిస్తూ బెయిల్ ఇవ్వడంపై సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేసింది.