• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

సమతామూర్తి… శిఖరాన్నంటిన కీర్తి

admin by admin
July 7, 2023
in politics
0 0
0
సమతామూర్తి… శిఖరాన్నంటిన కీర్తి
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఆనాటి వరకూ రాజకీయ నాయకులే ఉండేవాళ్ళు.. రాజకీయం మాత్రం చేసే రాజకీయం చేసే నాయకులు ఉండేవాళ్ళు.. ఆయనొచ్చాక రెండూ విడదీసేసాడు.. రాజకీయాన్ని నాయకత్వాన్ని విడదీసి.. దేని నిర్వచనం దానికే అంటూ కొత్త అర్థం రాసాడు.. రాజకీయం వేరు.. నాయకత్వం వేరు అంటూ కొత్త నిఘంటువు తయారు చేసి ఇంటింటికి పంచి పెట్టాడు.

ఎన్నిక‌ల సీజన్ లోనే రాజకీయాలు.. అవి ముగిశాక వట్టి నాయకుడిని.. సామాజిక ఉద్యమకారుణ్ణి.. సంక్షేమ సారధిని.. అభివృద్ధికి వారధిని అంటూ తనను తాను పునర్ లిఖించుకున్న అపూర్వ నాయకుడు.. పేదల కష్టాలతో యుద్ధం చేసేందుకు నేనున్నానంటూ పోరాడే సైనికుడు.

అప్పటివరకూ ఉన్న కాంగ్రెస్ నాయకుల ఎజెండా వేరు.. వారిది పార్టీ ఢిల్లీ పెద్దలు ఇచ్చిన ఎజెండా.. వారు రాసిన రాజ్యాంగమే వీళ్ళు అమలు చేసేవారు. టీడీపీ సైతం తమ పార్టీకి అనువైన ఎజెండాను ముందుకు మోసుకెళ్ళేది.

ఎన్నాళ్లిలా ? ఎన్నేల్లిలా.. నాయకుల ఎజెండాలకు కోసం ఎన్నికలు..వారి సౌలభ్యం కోసం ప్రభుత్వం.. ఇక అది కుదరదు.. సమాజానికి పొసగదు అని గుర్తించిన సామాజిక శాస్త్రవేత్త ఆయన.. పార్టీ ఇచ్చిన పాత కాలపు ఎజెండా కాపీలను చించేసి..ప్రజల ఎజెండాను జెండాగా చేసి సమున్నతంగా ఎగరేసి ఇంటింటా కొలువైన మానవ రూపంలో దేవుడిగా నిలిచిన నిలువెత్తు మానవత్వం ఆయన

తన అడుగులే నవ సమాజానికి నూతన ప్రస్థానంగా మారుస్తూ వెళ్లి వైఎస్సార్‌గా జనానికి పరిచయమైన యాడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి జీవితం ఓ చరిత్ర.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. జాతీయ కాంగ్రెస్ లో ఆయన అడుగుల ముద్రలు అలానే ఉన్నాయి..

ఆరోగ్య‌శ్రీతో పేద‌ల‌కు భ‌రోసా

అమ్మో అనారోగ్యం వస్తే వెయ్యి రూపాయలా ? అని భయపడే పేదింటి గుమ్మం ముందు నిలబడి ఇదిగో ఈ కార్డు ఉంచు.. ఏ ఆస్పత్రి అయినా నీకు ఎదురేగి వైద్యం చేస్తుంది అని చెప్పి ముందుకు సాగిన పెద్దాయన ఎన్నో వేల గుండెలకు ప్రాణం పోశారు. ఇప్పటికీ ఆ హృదయాలు లబ్..డబ్..లబ్ డబ్ అని కాకుండా వైఎస్ఆర్‌.. వైఎస్ఆర్‌ అని కొట్టుకుంటూనే ఉన్నాయి.

బ‌తుకులు మార్చిన ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్

అమ్మో ఆ చదువులు మనవల్ల కాదు..మన ఆవులు కాసుకో అని చెబుతున్న ఓ పేదింటి తండ్రి చెంతన నిలిచి నేనున్నాగా భయమెందుకు అని భుజం తట్టి ఆ పిల్లాడ్ని నడిపించుకుని వెళ్లి పెద్ద కాలేజీలో చేర్పించి ఆ చదువుల ఖర్చు భరించిన మరో మదన్ మోహన్ మాలవ్య ఆయన. పేదింటి పిల్ల‌లు కూడా పెద్ద చ‌ద‌వులు చ‌ద‌వాల‌న్న స‌ముచిత ల‌క్ష్యంతో ఆనాడు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని మొద‌లు పెట్టారు దివంగ‌త వైయ‌స్ఆర్‌.

ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ కట్టడం కాదు.. ప్రభుత్వ ప్రధాన విధానాల్లో రైతు సంక్షేమం, నీటి వనరుల నిర్వహణ.. నిర్మాణం.. ఓ ప్రధాన బాధ్యత కావాలంటూ జలయజ్ఞాన్ని ప్రారంభించి లక్షల ఎకరాలకు నీళ్ళు పారించి రాష్ట్రంలో సిరులు పండించేందుకు శ్రీకారం చుట్టారు.

సమతా మూర్తికి కొత్త నిర్వచనం…

అందర్నీ సమ భావనతో చూడడం యోగులు.. బుద్ధులు..లోక సంచారులైన మహానీయులకే సాధ్యం.. మరి రాజకీయ నాయకుడైన వైఎస్ఆర్‌కు అంతటి విశాల భావన ఎలా అబ్బింది… ఈయన రాష్ట్ర సంచారి.. ఎన్ని రోజులు..ఎన్ని కాలాలు.ఎన్ని జిల్లాలు..ఎన్ని లక్షలమంది ప్రజలు.. ఇవన్నీ చూశాక ఆయనలో సమతావాది నిద్రలేచాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటికి.. ప్రతి గుండెకు.. ప్రతి మమసుకు చేరువయ్యేలా పరిపాలించారు. ఆయన మరణించి ప్రజల గుండెల్లో జీవించి ఉన్నారు.

భవతీ భిక్ష అని ఇంటిముందు నిలబడి యాచించిన మహానీయుడిని కనీసం ఆదరించలేని ఓ నిరుపేద తల్లి ఓ ఉసిరికాయను భిక్ష పాత్రలో వేసిందట. అంత పేదరికంలోనూ తనపట్ల ఇంత ప్రేమను కనబరిచిన ఆ పెదరాలిని కరుణించేందుకు ఆ ఆదిశంకరుడు ఏకంగా కనకధార స్త్రోత్రం లక్ష్మి దేవిని రప్పించి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించి ఆయన అంతర్థానమైపోయాడట. పేదరికంతో అల్లాడుతున్నప్పటికీ తనపట్ల అంతులేని ప్రేమ చూపిన ఆంధ్రప్రదేశ్ ప్రజలపై వైఎస్ఆర్‌ కూడా అదే రీతిలో సంక్షేమ వరాలు కురిపించి ఆయన మన కళ్ళముందే అంతర్థానమైపోయారు.

మనిషిగా నువ్వు లేవు
మనసుల్లో నువ్వున్నావు
ఎదురుగా నువ్వు లేవు
మా యదలో నువ్వున్నావు
కళ్ళముందు నువ్వు లేవు
మా కళ్ళల్లో మా కలల్లో నువ్వున్నావు
నువ్వుంటావు రాజన్న…
ఎప్ప‌టికీ మాతోనే ఉంటావ్ రాజ‌న్న..

వైయస్సార్ ఆశయాలు ఆలోచనలు కొనసాగిస్తూ రాష్ట్రంలోని ప్రతి పేదవాడి ఇంటా సంతోషాలు నింపే బాధ్యత తీసుకున్న సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన్ను తమ ఇంటి పెద్ద కొడుకు మాదిరి ఆశీర్వదిస్తూ ఈయనలో పెద్దయనను చూసుకుంటూ ప్రజలు సంతోషిస్తున్నారు.

Previous Post

భార్యను బిడ్డను బయటకు పంపి తాళం వేసిన వైసీపీ యువనేత

Next Post

జూనియర్ ఎన్టీయార్ అభిమానిపై దాడి

Next Post
జూనియర్ ఎన్టీయార్ అభిమానిపై దాడి

జూనియర్ ఎన్టీయార్ అభిమానిపై దాడి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

దిల్ రాజు ముఖ్య అతిథిగా… శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు
movies

దిల్ రాజు ముఖ్య అతిథిగా… శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు

by admin
August 26, 2026
0

...

Read more
గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

August 24, 2026
“జయహో జనార్ధన”సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసిన దర్శకుడు బుచ్చిబాబు

“జయహో జనార్ధన”సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసిన దర్శకుడు బుచ్చిబాబు

August 23, 2026
ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?

ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?

August 19, 2026
రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

August 18, 2026
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

August 18, 2026
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

August 18, 2026
“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

August 17, 2026
దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

August 16, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In