టీసీఎస్ లాంటి సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎలాంటి లోపాలు లేకుండా టిక్కెటింగ్ సాఫ్ట్‌వేర్‌ను నిర్వహిస్తూంటే హఠాత్తుగా టీటీడీ పాలకులు టీసీఎస్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకుని ఆ పనిని జియో మార్ట్‌కు అప్పగించారు. జియో మార్ట్ అనేది ముఖేష్ అంబానీ కి చెందినది. రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన జియో మార్ట్ నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునే యాప్. అయితే ఇప్పుడు ఈ యాప్‌కే టిక్కెట్ల బుకింగ్ బాధ్యతలు ఇచ్చారు. సర్వదర‌్శనం టిక్కెట్లను అమ్మకానికి పెట్టిన టీటీడీ ఈ రోజు వాటిని రిలీజ్ చేసింది.
అయితే ఎవరికీ టిక్కెట్లు బుక్ కాలేదు. టిక్కెట్ల కోసం ప్రయత్నించిన వారికి వెబ్‌సైట్‌లో క్లిక్ చేయగానే అది జియో మార్ట్ కు వెళ్లిపోతోంది. ఎమిటా అని కంగారు పడిన భక్తులు చివరికి అది టీటీడీ అధికారికంగా జియో మార్ట్‌కు ఇచ్చినట్లుగా తేలింది. ఎవరికీ టిక్కెట్లు బుక్ కాలేదు. దీంతో టీటీడీ పాలకులు టిక్కెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారన్న ఆరోపణలను సోషల్ మీడియాలో భక్తులు ఆరోపించడం ప్రారంభించారు. అసలు టీసీఎస్‌ను కాదని ఓ జియో మార్ట్ యాప్‌కు ఎందుకు చాన్సిచ్చారన్నదే పెద్ద పజిల్‌గా మారింది. టీటీడీ నిర్ణయం తీవ్ర విమర్శలకు గురి కావడం ఖాయంగా కనిపిస్తోంది.
టీటీడీ వ్యవహారాల్లో ఇప్పటికే ప్రభుత్వం.. టీటీడీ పాలక మండలి తీరు చాలా వివాదాస్పదం అవుతోంది. టీటీడీ బోర్డులోకి నియమించిన ప్రత్యేక సలహాదారుల జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇప్పుడు భక్తుల టిక్కెట్ల అంశాన్నీ క్లిష్టతరం చేయడంతో భక్తుల ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.