మెగాస్టార్ చిరంజీవి సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ లేఖ రాసారు. జాతీయ స్థాయిలో తెలుగు ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ పురస్కారానికి ఎంపిక కావటం పట్ల అభినందనలు తెలిపారు. తెలుగు సినీ రంగం గర్వించదగిన శిఖర సమాన కళాకారుల్లో చిరంజీవి ఒకరుగా పేర్కొన్నారు. కళామతల్లికి ఆయన సేవలు మహోన్నతం. చిరంజీవికి లభించిన పురస్కారం తెలుగు సినీ రంగానికి గర్వకారణమని ఎన్వీ రమణ ప్రశంసించారు.
మంచు మోహన్ బాబు సైతం చిరంజీవిని అభినందించారు. చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్..అన్నయ్య కు అవార్డు రావటం పట్ల సంతోషం వ్యక్తం చేసారు.ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు కింద పురస్కార గ్రహీతకు నెమలి బొమ్మ కలిగిన రజత పతకం, రూ.10 లక్షల నగదు, ధ్రువీకరణ పత్రం మెగాస్టార్ చిరంజీవి అందుకోనున్నారు.
చిరంజీవి స్వయంకృషితో అత్యున్నత శిఖరాలను అధిరోహించారని అభినందించారు.