దిశ బిల్లు చట్ట రూపం దాల్చకపోయినా మహిళల్లో ఆత్మస్థైర్యాన్నిపెంపొందించేందుకు ఎంతగానో దోహదపడుతున్నదని, అటు వంటి బిల్లును ప్రతిపక్ష నాయకులు చింపివేయడం మహిళలను అవమానించడంతో సమానమని రాష్ట్ర మహిళా అభివృద్ది, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.
బుధవారం సచివాలయం బ్లాన్ నెం.4 లోని పబ్లిసిటీ సెల్లో పాత్రికేయులతో ఆమె మాట్లాడుతూ దిశ బిల్లు, దిశ యాప్ వల్ల రాష్ట్రంలోని మహిళకు తక్షణమే అందుతున్న న్యాయం, రక్షణ అంశాలను వివరించారు.
తెలంగాణా రాష్ట్రంలో ఒక మహిళకు జరిగిన అన్యాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎంతగానో చలించిపోయారని,
అటు వంటి అన్యాయం రాష్ట్రంలోని మహిళకు జరుగకూడదని భావించి దిశ బిల్లును ప్రతిపాదించారన్నారు.