దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేసిన శివ నాగేశ్వరరావు ‘దోచేవారెవరురా’ టీజర్
IQ క్రియేషన్స్ బ్యానర్ పై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరావు తెరకెక్కిస్తున్న సినిమా ‘దోచేవారెవరురా’. ఇప్పటికే దర్శకుడు రాంగోపాల్ వర్మ చేతల మీదుగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతోపాటు లిరికల్ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా “దోచేవారెవరురా” సినిమా టీజర్ విడుదల చేశారు.
దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘నేను శివ నాగేశ్వరరావు గారి సినిమాల్లోని కామెడీ, ఎంటర్‌టైన్మెంట్ బాగా ఎంజాయ్ చేస్తాను. ఈయన తెరకెక్కిస్తున్న “దోచేవారెవరురా” కూడా అంతే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ సినిమా టీజర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు.
అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టులో సినిమాను విడుదల చేస్తామని తెలిపారు మేకర్స్. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు యూనిట్.
బ్యానర్: IQ క్రియేషన్స్
దర్శకుడు: శివనాగేశ్వరరావు
నిర్మాత: బొడ్డు కోటేశ్వరరావు
PRO: లక్ష్మీ నివాస్