• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

నా కార్యకర్తలను అప్పుల పాలు చేశా;వైసీపీ ఎమ్మెల్యే

admin by admin
June 29, 2022
in politics
0 0
0
నా కార్యకర్తలను అప్పుల పాలు చేశా;వైసీపీ ఎమ్మెల్యే
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ప్రకాశం జిల్లా ప్లీనరీలో వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా కార్యకర్తలను అప్పులపాలు చేశానని వారిని ఆదుకోవాల్సిన అవసరం పార్టీకి ఉందని అన్నారు. నా నియోజకవర్గంలో పనులను వైసీపీ కార్యకర్తలకు అప్పగించానని దీంతో వారు అప్పుల పాలు అయ్యారని పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారిని పార్టీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శి నియోజకవర్గంలో పనులు చేసిన కార్యకర్తలకు రూ.100కోట్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి కార్యకర్తలకు రావాల్సిన పేరుకుపోయిన బిల్లులు మంజూరు చేయాలని సూచించారు. లబ్దిదారులకు సీఎం జగన్ బటన్ నొక్కి డబ్బులు వేయటం వల్ల..ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరగటంలేదని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటువంటి ఇబ్బందులు..బాధలు ఒక్క దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టికే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో చాలామందికే ఉంది. గతంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సైతం ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లుల విషయంలో సొంత ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు చేసిన వారికి బిల్లులు రావడం లేదని… ప్రతిష్టకు పోయి పనులు చేసిన పార్టీలోని దిగువ స్థాయి నేతలు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో మీడియా సమావేశం పెట్టిన ధర్మాన ప్రసాదరావు బిల్లులు ఆలస్యం కావడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కింది స్థాయి నేతలు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పిటీసీలు ప్రతిష్టకు పోయి పనులు ప్రారంభించారని కానీ ఇప్పుడు వారు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారని అన్నారు.ఇటువంటి విషయాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దృష్టికి తీసుకెళ్లానని ఆయినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు.
కాగా..మద్దిశెట్టి వేణుగోపాల్ 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తరువాత వైసీపీలో చేరారు. 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కదిరి బాబూరావుపై గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీ లోకి అడుగుపెట్టారు.

Previous Post

ఎంపీ రఘురామపై సీఐడీ విచారణకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్

Next Post

Shivani Rajasekhar withdraws from Femina Miss India 2022

Next Post
Shivani Rajasekhar withdraws from Femina Miss India 2022

Shivani Rajasekhar withdraws from Femina Miss India 2022

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా
movies

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

by admin
June 19, 2026
0

...

Read more
హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

June 13, 2026
‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

June 12, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

June 11, 2026
“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

May 31, 2026
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In