• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

పేదలకు దక్కాల్సిన రేషన్ కొందరు ధనికవర్గ పెద్దలు తింటున్నారు ; మంత్రి పేర్ని నాని

admin by admin
September 9, 2021
in politics
0 0
0
పేదలకు దక్కాల్సిన రేషన్ కొందరు ధనికవర్గ పెద్దలు తింటున్నారు ; మంత్రి పేర్ని నాని
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

విద్యుత్ బిల్లు నెలకు రెండు వేల రూపాయలు ఒకవైపు చెల్లిస్తూ, మరోపక్క  పేదలకు దక్కాల్సిన రేషన్ కొందరు ధనికవర్గ పెద్దలు  తింటున్నరని, ఆ వ్యక్తుల జాబితా.. వారి ఆర్ధిక స్థితిగతులు పరిశీలిస్తే, తనకు ఎంతో  ఆశ్చర్యం కల్గుతుందని ఏపీ రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) విస్మయం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని ముఖాముఖిగా సంభాషించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు.

      స్థానిక  25 వ డివిజన్ కార్పొరేటర్ కొలుసు హరిబాబు  తన  పరిధిలో కొందరు పింఛన్ దారులకు పింఛన్ తొలగించనున్నట్లు  నోటీసులు వచ్చినట్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై మంత్రి స్పందిస్తూ, ఈ నెల 11లోగా మరోసారి తనిఖీలు చేపట్టి అనర్హుల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇటీవల అందాయిని దీంతో అధికారులు ఆ నిబంధనల మేరకు లేని పింఛన్లను పార్టీలకు అతీతంగా తొలగించేందుకు సిద్ధమయ్యారన్నారు. ఇందులో అత్యధికంగా కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందనో, లేక ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉన్నాయనో లేక ఇంట్లో రెండు పించన్ల ఉన్నాయనే నిబంధన ప్రకారం అనర్హత కారణంగా ఆయా పింఛన్ల తొలగింపు తధ్యం అంటూ అధికారులు లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసేరన్నారు. రాష్ట్రంలో పెన్షన్‌, రేషన్‌ కార్డులను తొలగించకుండా ఉంచాలంటే, కొత్తది మంజూరు చేయాలంటే కరెంటు బిల్లులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావించండన్నారు. రాష్ట్రంలో 200 యూనిట్‌లు దాటితే తెలుపు రేషన్‌ ఆగిపోవడం , 300 యూనిట్‌లు దాటితే పెన్షన్‌ నిలిచిపోయే నిబంధన అమల్లో ఉందన్నారు. కరెంటు బిల్లు ఎక్కువ కడుతున్నారా? లేదా? అనే విషయాలను వాలంటీర్లు ఇప్పటికే ఇంటింటికి సర్వే చేస్తున్నారని మంత్రి వివరించారు.
మచిలీపట్నం మండలం శిరివెళ్లపాలెం గ్రామానికి చెందిన శిరివెళ్ల నాగేశ్వరమ్మ మంత్రిని కలిసి తన కష్టాలు ఏకరువు పెట్టింది.  తన కోడలు తనను సరిగా చూడదని, తాను నీటి బోరు వేయించానని, కోడలు  ఆ నీరు పట్టుకోనివ్వకుండా పైప్ కోసివేసిందని ఆమె మాత్రం వేరే నీటి పైప్ కొనుక్కొని ఆమె మాత్రమే నీరు పట్టుకొంటుందని దారుణమైన బూతులు తిడుతూ నిత్యం  వేధిస్తోందని పిర్యాదు చేసింది.
స్థానిక చిలకలపూడికి చెందిన ఒక చర్చికు  కొందరు పెద్దలు వచ్చి మంత్రిని కలిశారు. తమ చర్చికు అత్యధిక పన్ను విధించారని తమ స్థలంలోనే లైసెన్సుడ్ సర్వెయర్ ద్వారా ప్లాన్ ఏర్పర్చుకొంటామని తమకు వస్తున్న పన్ను తగ్గించాలని  అభ్యర్ధించారు. ఈ విషయమై స్పందించిన మంత్రి మునిసిపల్ ఏ సి పి ని సంప్రదించాలని సూచించారు.
తనపై ఇటీవల 124 ఏ సెక్టన్  దేశద్రోహం కేసు పెట్టారని కమ్యూనిస్టు నాయకుడు కొడాలి శర్మ మంత్రికి తెలిపారు.
జిల్లా వికలాంగ సంక్షేమ శాఖ ఇటీవల దివ్యాoగులకు 35 వేల రూపాయల ఖరీదు చేసే ఛార్జింగ్ బ్యాటరీతో నడిచే మూడు చక్రాల వాహనం ఇచ్చారని  అది కేవలం నెలరోజులు మాత్రమే నడిచిందని , ఆ తర్వాత ఛార్జింగ్ నిలవడం లేదని స్థానిక నిజాంపేటకు చెందిన ఆళ్లకుంట చిన్నింటయ్య మంత్రికి తెలిపారు.  కార్యాలయంకు వెళ్లి  చెబుతుంటే ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదని, మచిలీపట్నంలో ఇచ్చి న  6 వాహనాలు , గ్రామీణ ప్రాంతాలలో ఇచ్చిన  మరో ఆరు వాహనాల పరిస్థితి ఇదే విధంగా ఉందని మంత్రికి ఆయన  చెప్పారు.
మచిలీపట్నం మండలం పోలాటితిప్ప గ్రామంలో తమ పొలంలో సర్వే చేసేందుకు 2009 సర్వేయర్ ను భూమి వద్దకు తీసుకెళ్లామని నాడు తమ పొలం అది కాదని వేరే డొంక ప్రాంతం  చూపించాడని ఖాసిమ్ అనే వ్యక్తి మంత్రి వద్ద తెలిపాడు,  తిరిగి 2018 లో  మరోమారు ఆదే సర్వేయర్  సర్వే చేసి హద్దులు చూపించి  మీరు చెప్పిందే కరెక్ట్ అని అదే పొలం మీదేనని ఒప్పుకున్నారని మంత్రికి చెప్పారు. తమ పొలం ఎవరి ఆక్రమణలో లేదని అయితే,  కొందరు తమ భూమిని తక్కువ రేటుకు అమ్మాలని వత్తిడి తెస్తున్నారని   ఖాసీం చెప్పారు.

Previous Post

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో ‘’భవదీయుడు భగత్ సింగ్”

Next Post

ఆరు రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల

Next Post
ఆరు రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల

ఆరు రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

‘కేడీ : ది డెవిల్’ నుంచి నోరా ఫతేహీ, సంజయ్ దత్ మాస్ బీట్ ‘జరిపెయ్ నాతో పండుగ జరిపెయ్’ రిలీజ్
movies

‘కేడీ : ది డెవిల్’ నుంచి నోరా ఫతేహీ, సంజయ్ దత్ మాస్ బీట్ ‘జరిపెయ్ నాతో పండుగ జరిపెయ్’ రిలీజ్

by admin
March 15, 2026
0

...

Read more
అమూల్ తరువాత నాణ్యతలో సంగం డెయిరీనే..సవాల్ విసురుతున్నా _ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ

అమూల్ తరువాత నాణ్యతలో సంగం డెయిరీనే..సవాల్ విసురుతున్నా _ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ

March 5, 2026
సన్ ఆఫ్ మూవీ రివ్యూ: కట్టిపడేసే తండ్రీకొడుకుల బంధం

సన్ ఆఫ్ మూవీ రివ్యూ: కట్టిపడేసే తండ్రీకొడుకుల బంధం

February 28, 2026
పేలుడులో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం- సీఎం చంద్రబాబు

పేలుడులో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం- సీఎం చంద్రబాబు

February 28, 2026
హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

February 28, 2026
యూత్‌ఫుల్ లవ్ డ్రామాతో  హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై ప్రెస్టేజీయస్  ప్రాజెక్ట్ ప్రారంభం

యూత్‌ఫుల్ లవ్ డ్రామాతో హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై ప్రెస్టేజీయస్ ప్రాజెక్ట్ ప్రారంభం

February 28, 2026
హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

February 28, 2026
రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

February 28, 2026
KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు..100 కోట్ల డాల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌

KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు..100 కోట్ల డాల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌

February 28, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In