గ్రామ/ వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు కార్యాలయంలోకి రాగానే సకాలం లో బయో మెట్రిక్ హాజరు తప్పని సరిగా వేయాలని ఆయా సచివాలయ పరిధిలో పని చేసే వాలంటీర్లు వారంలో మూడు రోజుల పాటు బయో మెట్రిక్ హాజరు వేయాలని,
స్పందన కార్యక్రమం లో వచ్చే అర్జీలకు అత్యంత ప్రదాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ అన్నారు.
మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు.
ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది సకాలంలో బయో మెట్రిక్ వేయాలని, వాలంటీర్లు కూడా నిర్ణయించిన మేరకు సోమ, బుదు, శుక్రవారాల్లో బయో మెట్రిక్ హాజరు తప్పని సరిగా వేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజలు లేదా పట్టణాల్లో నివసించే ప్రజల సమస్యల కోసం సచివాలయ వ్యవస్థ ఏర్పడిందని, సర్వీసు డెలివరీ విషయంలో నిర్ణీత సమయం లోపల సేవలను అందించాలని,
చిత్తూరు జిల్లాలోని కొంగరెడ్డిపల్లి సచివాలయం, తిరుపతి లోని యూనియన్ ఆఫీసు సచివాలయం గత నెలలో ఎటువంటి సేవలు అందించ లేదని అన్నారు.
ఒక నెల రోజుల పాటు సేవల వివరాలను పరిశీలించడం జరిగిందని, ఎం.పి.డి.ఓ లు, కమిషనర్లు దీని పై మరింత దృష్టి పెట్టి సేవలను పెంచాలన్నారు. సకాలంలో 30 సేవల కన్నా తక్కువ సేవలు అందించిన సేవల్లో పలు సచివాలయాలు ఉన్నాయని, వీటన్నిటిని సకాలంలో పూర్తి అయ్యేలా స్పందించాలన్నారు.
ఎం.పి.డి ఓ లు, కమిషనర్ లు ఎప్పటికప్పుడు సర్వీసు రిక్వెస్ట్ లను పరిశీలించి సంబందిత అధికారులతో సంప్రదించి గడువు లోగా సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
పలు డిపార్ట్ మెంట్ లకు సంబందించిన పలు సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని అందులో విధ్యుత్, సదరన్ సర్టిఫికేట్ ల మంజూరు, మునిసిపల్ వ్యవహారాలకు సంబందించిన సమస్యలు ఉన్నాయని చివరకు ఎం.పి.డి.ఓ ల పరిధిలో ఉన్న జాబ్ కార్డులు కార్డులు కూడా అందించ లేదన్నారు.
రవాణా శాఖ కు సంబందించి ఎల్.ఎల్.ఆర్ లు, వాహన మిత్ర ధరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, చేయూత, కాపు నేస్తం, నేతన్న నేస్తం, రైతు భరోసా, మత్స్య కార భరోసా, జగనన్న తోడు వంటి పధకాలకు సంబందించిన లబ్ది దారుల సమస్యలు కూడా పెండింగ్ లో ఉన్నాయని, ధరఖాస్తు వచ్చిన వెంటనే నిర్ణీత గడువు లోపల వారి సమస్య కు పరిష్కారo చూపాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, సచివాలయాల పరిధిలో సమస్యలను స్వీకరించి వారి రశీదు ఇచ్చి సంబందిత శాఖలకు పంపి సకాలంలో వారి సమస్యలు పరిష్కారం అయ్యే లా చూడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) వెంకటేశ్వర్, ట్రైనీ కలెక్టర్ అభిషేక్ కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) రాజశేఖర్ లు పాల్గొన్నారు.