అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే 90శాతానికి పైగా హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. విశాఖ నగరం లోని తూర్పు నియోజకవర్గం పరిధిలోని వివిధ వార్డులకు చెందిన లబ్ధి దారులకు ఇళ్ల పట్టాలను
ఆయన అందచేశారు. స్థానిక ఎ.ఎస్. రాజా గ్రౌండ్స్ లో గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన అమర్ నాథ్ మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ఆరోగ్యశ్రీ వంటి అద్భుత పథకాలను అమలు చేశారని, జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అమ్మ ఒడి, రైతు భరోసా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటు న్నారని మంత్రి అమర్ చెప్పారు. సంక్షేమం పేరు చెపితే రాజశేఖర్ రెడ్డి, జగన్ గుర్తుకు వస్తారని ఆయన
అన్నారు .దేశంలో నే మరెక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశలో 32 లక్షల మందికి సొంత ఇళ్లు మంజురు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇటువంటి వంటి ఘనత దక్కలేదని ఆయన చెప్పారు. లబ్ధిదారులకు ఎక్కడో మారుముల ప్రాంతాల్లో ఇళ్ల స్థలను కేటాయించలేదని, జాతీయ రహదారులు, నగర పరిధిలోన్ను ప్రాంతాల్లోనే స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణానికి నిదులు కేటాయించారని మంత్రి అమర్ వెల్లడించారు.ఇటు వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు జగన్ ఒక పక్క చేపడుతుంటే, ప్రతి పక్ష నేత చంద్ర బాబు కోర్టులకు వెళ్లి పధకాలు అమలు కాకుండా అడ్డుకుంటున్నారని మంత్రి అమర్ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్ర చెప్పుకోదగ్గ ఒక్క సంక్షేమ పథకాన్నిఅమలు చేయలేకపోయారని, ఒక్కపథకం పేరు చెప్పినా ఆయన కాళ్ళ కింద నుంచి దూరి వెళతానని అమర్ నాథ్ సవాలు విసిరారు. జనంలో విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుచుకుంటామని చెప్పడం ఆయన తెలివి తక్కువతనానికి నిదర్శనమని అమర్ అన్నారు. జగన్ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటే వచ్చే ఎన్నికల్లో మూడుసీట్లు కూడా రావని ఆయన అన్నారు. జగన్ రాష్ట్రలోని మహిళలకు బీసీ, ఎస్టీ, ఎస్సీలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని చంద్రబాబు హాయంలో ఈ వర్గాలకు కనీస ప్రాధాన్యత లేకుండా పోయిందన్నారు. జగన్‌ను టీడీపీ నాయకులు అయ్యన్నపాత్రుడు, అనిత తదితరులు తీవ్రంగా పరుష పదజాలంతో విమర్శిస్తుంటే చంద్రబాబు చప్పట్లు కోట్టడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని అమర్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ని రెండోసారి ముఖ్యమంత్రిని చేయడానికి తాను ఒక సామన్యకార్యకర్తగా ఎక్కడికైనా వచ్చి పనిచేస్తానని అమర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, తూర్పు నియోజకవర్గానికి చెందిన కార్పోరేటర్లు, కార్పోరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే మంత్రి అమర్ పలువురి లభ్డిదారులకు తన చేతుల మీదుగా పట్టాలను పంపిణీ చేశారు.