మొన్న తోఫా, విదేశీవిద్య నేడు దుల్హాన్ ఇలా రోజుకొకటి చొప్పు న ముస్లింలకు ఇచ్చే పథకాలను ప్రభుత్వం రద్దు చేస్తోందని అధికార పార్టీలోని ముస్లింలు అందరూ తమ పదవులను రాజీనామా చేయాలని సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు, జిల్లా అధ్యక్షుడు పార్థసారధి మాజీ మంత్రి వర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దుల్హాన్ పథకం వెంటనే అమలు చేయాలని తెదేపా మైనారిటీ నాయకులు పుట్టపర్తిలో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ గారిని కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుల్హన్‌కు టీడీపీ 50వేలు ఇస్తుంటే తాము లక్ష ఇస్తామంటూ చెప్పి మాటతప్పి అసలే రద్దు చేశారని తెలిపారు. రంజాన్‌తోఫాను రద్దు చేయడం సిగ్గు చేటని తెలిపారు. టీడీపీ హయాంలో విదేశీ విద్యకు 10లక్షలు ఆర్థిక సహాయం అందించేవారని, హజ్‌హౌస్ లు నిర్మించారన్నారు. ప్రభుత్వం స్పందించి పథకాలు అమలు చేయకపోతే ఉద్యమం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెదేపా కమిటీ సభ్యులు డైమండ్ బాబా గారు, రాష్ట్ర మైనారిటీ ముస్లిం కార్యదర్శి మహమ్మద్ రఫీ గారు, సత్యసాయి జిల్లా తెదేపా కమిటి సభ్యులు ఇతర ముఖ్య నాయకులు పాల్గోన్నారు.