అనంతపురం జిల్లాలోని అతి పెద్ద చెరువు అయిన బుక్కపట్నం చెరువును గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నింపి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేలాది ప్రజల సమక్షంలో ఎంతో పవిత్రంగా నిర్వహించిన జలహారతి కార్యక్రమానికి గుర్తుగా, చెరువు వివరాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన పైలాన్ ను కొంత మంది దుండగులు గత రాత్రి ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు.
అభివృద్ధికి చిహ్నాలుగా, చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా పైలాన్ ఏర్పాటు చేస్తారు అని, వాటిని ఎన్ని సంవత్సరాలు గడిచిన సంరక్షణ చేయాల్సిన బాధ్యత అందరిది అని కానీ ప్రభుత్వాలు మారక ఇలా కొందరు ఆకతాయిలు ధ్వంసం చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు.
పోలీసులు వెంటనే ఈ సంఘటన పై కేసు నమోదు చేసి బాద్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ పైలాన్ తిరిగి ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చెరువు కట్ట పై అప్పుడప్పుడు నిఘా ఉంచాలని పేర్కొన్నారు.