సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పక్కా వ్యూహంతోనే మెగాస్టార్ చిరంజీవిని ఇంటికి పిలిచి ఆదరించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కౌంటర్ చేయడానికి ఆయన అన్నయ్య చిరంజీవిని వైఎస్ జగన్ వాడుకుంటున్నట్లు అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలపై చిరంజీవికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం ఇందులో భాగమేనని అంటున్నారు. సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా చిరంజీవి వ్యవహరించడానికి తగిన ప్రాతిపదికను కూడా జగన్ సిద్ధం చేసినట్లు అనిపిస్తోంది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులను పక్కన పెట్టి చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించి సినీ పరిశ్రమ సమస్యలపై జగన్ చర్చించారు. చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. అంతేకాకుండా చంద్రబాబుతో పొత్తుకు కూడా పవన్ కల్యాణ్ సంకేతాలు ఇచ్చినట్లు భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు రాష్ట్రంలో 20 నుంచి 25 శాతం వరకు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వడం వల్లనే వైసీపీ ఓటమి పాలైందన్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జనసేన ఒంటరిగా పోటీ చేయడం కూడా జగన్ కు కలిసి వచ్చింది. ఈ దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి జగన్ వ్యూహరచన చేసినట్లు భావించాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో భవిష్యత్తులో చిరంజీవికి రాజ్యసభ టిక్కెట్ ఇవ్వడానికి కూడా జగన్ సిద్దంగా ఉన్నట్టు సమాచారం. గతంలో చిరంజీవి తన ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారు. ఈ సారి రాజ్యసభ సభ్యత్వం దక్కించు కుంటారని అంటున్నారు. రాజకీయ అంశాలు మాట్లాడ వలసి ఉన్నందున చిరంజీవి ఇతర సినీ ప్రముఖలు ఎవరినీ వెంట తీసుకుని వెళ్ళ లేదని అంటున్నారు.
ఈ విశ్లేషణ తప్పనే వారు క్రింది ప్రశ్నలకు జవాబు చెప్పండి.
1. చిరంజీవి ఒకరే ఎందుకు కలిశారు
2. సినిమావారి సంఘం అయిన మా అద్యక్షుడు మంచు విష్ణును జగన్ ఎందుకు పిలవలేదు
3. చిరంజీవి నివేదించిన కోర్కెలు ఏవి ?
4. జగన్, చిరంజీవి మధ్య జరిగిన చర్చల్లో యే యే అంశాలు చర్చించారు
5 చిరంజీవి యే హోదాతో జగన్ ను కలిశారు
6. సినిమా టిక్కెట్ల తగ్గింపు విషయంలో జగన్ చేసింది కరెక్టేనా ?
7.మళ్ళీ జగన్ సీఎం కావాలనుకుంటున్నారా ?