• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

జాతీయ రహదారి మూడవ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన బి.గోపాల్

admin by admin
September 6, 2021
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

“సమరసింహరెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర” వంటి ఇండస్ట్రీ హిట్స్ కలిగిన దర్శకసంచలనం బి.గోపాల్… “జాతీయ రహదారి” చిత్రంలోని మూడవ పాటను విడుదల చేశారు. భీమవరం టాకీస్ పతాకంపై శతాధిక చిత్రనిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నరసింహ నంది దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ.. నరసింహ నంది నా దగ్గర చాలా సినిమాలకు కో డైరెక్టర్ గా పని చేశాడు. అనేక జాతీయ అవార్డు సినిమాలు తీశారు. అలాగే ఇప్పుడు తీసిన జాతీయ రహదారి ట్రైలర్ చూశాను చాలా బాగుంది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. రామసత్యనారాయణ అలుపెరగని నిర్మాత. సినిమా వెనుక సినిమా తీస్తూనే ఉంటాడు. నాకు దర్శకుడుగా జీవితాన్ని ఇచ్చిన మా రామానాయుడు గారు 150 సినిమాలు తీశారు. ఆ బాటలోనే రామసత్యనారాయణ సినిమాలు తీస్తాడు. అందరికి అందుబాటులో ఉంటాడు ఏమి గర్వం లేదు. ఈ వయసులో కూడా అంత ఓపిక, ధైర్యం ఉండండం మాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. జాతీయ రహదారి వంటి మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తనకు ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి” అన్నారు.

*చిత్ర నిర్మాత తుమ్మల రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. బి.గోపాల్ గారు నెంబర్ 1 యాక్షన్ డైరెక్టర్…ఆయన చేతులు మీదుగా ఈ రోజు 3వ లిరికాల్ సాంగ్ విడుదల కావడం గర్వంగా ఉంది. ఆయన శిష్యుడు నరసింహ నంది సెపరేట్ పంథాలో హార్ట్ టచింగ్ కథలను సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తుంటాడు. గతంలో “1940 లో ఓ గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జ” లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశాడు. నేను ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు తీశాను కానీ అవార్డు వచ్చే సినిమాలు తీయలేదనే బాధ ఉండేది. ఇంత కాలానికి జాతీయ రహదారితో ఆ కోరిక తీరనుంది. కరోనా టైంలో నా బాద్యతను కూడా తనే తీసుకొని సినిమా చేశాడు. సినిమా చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ట్రైలర్ చూసిన వి.వి.వినాయక్ గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, యండమూరి వీరేంద్రనాథ్ గార్లు తనని అభినందించారు. ట్రైలర్ కూడా చూడటానికి కూడా ఇష్టపడని రాంగోపాల్ వర్మకు ఈ ట్రైలర్ నచ్చి… చాలా బాగుంది అని డైరెక్టర్ ను పిలిపించుకుని అభి నందించారు. ఇంతమంది పెద్దలు ఈ సినిమాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు అంటే ఈ సినిమా ఇప్పటికే 50 % సక్సెస్ అయ్యిందని అనుకుంటున్నాను. ఈ నెల 10వ తేదీన వినాయక చవితి కానుకగా రెండు తెలుగు రాష్ట్రాలలో 200 థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం” అని అన్నారు.

నరసింహ నంది మాట్లాడుతూ… అందరూ వెళ్లే దారి లో కాకుండా కొత్త దారిలో వెళ్ళాలి అని అనేవారు. అదే జాతీయరహదారి. గోపాల్ గారి ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉంటాయి. మల్లిక్ రాసిన పాటకు సుబ్బు స్వరాలు కూర్చారు” అన్నారు!!
నటి నటులు:
మధు చిట్టె, సైగల్ పాటిల్ , మమత, ఉమాభారతి, మాస్టర్ నందిరెడ్డి. ధక్షిత్ రెడ్ది, అభి, తెల్జెరు మల్లెష్, తరని, గోవిందరాజు, ఘర్షణ శ్రీనివాస్., విజయ భాస్కర్, సిద్దిపెట రవి తదితరులు.

Previous Post

ఇ-రక్షణ పరికరాల అవగాన సదస్సు

Next Post

ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్న అమెరికా అబ్బాయి

Next Post

ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్న అమెరికా అబ్బాయి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

అమూల్ తరువాత నాణ్యతలో సంగం డెయిరీనే..సవాల్ విసురుతున్నా _ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ
politics

అమూల్ తరువాత నాణ్యతలో సంగం డెయిరీనే..సవాల్ విసురుతున్నా _ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ

by admin
March 5, 2026
0

...

Read more
సన్ ఆఫ్ మూవీ రివ్యూ: కట్టిపడేసే తండ్రీకొడుకుల బంధం

సన్ ఆఫ్ మూవీ రివ్యూ: కట్టిపడేసే తండ్రీకొడుకుల బంధం

February 28, 2026
పేలుడులో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం- సీఎం చంద్రబాబు

పేలుడులో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం- సీఎం చంద్రబాబు

February 28, 2026
హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

February 28, 2026
యూత్‌ఫుల్ లవ్ డ్రామాతో  హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై ప్రెస్టేజీయస్  ప్రాజెక్ట్ ప్రారంభం

యూత్‌ఫుల్ లవ్ డ్రామాతో హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై ప్రెస్టేజీయస్ ప్రాజెక్ట్ ప్రారంభం

February 28, 2026
హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

February 28, 2026
రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

February 28, 2026
KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు..100 కోట్ల డాల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌

KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు..100 కోట్ల డాల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌

February 28, 2026
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్

February 28, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In