• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఇంటర్వ్యూ;  బ్రేకప్‌తో మొదలయ్యే ‘వరుణ్‌ డాక్టర్‌’ కథ నవ్విస్తుంది- శివకార్తికేయన్‌ 

admin by admin
October 6, 2021
in movies
0 0
0
ఇంటర్వ్యూ;  బ్రేకప్‌తో మొదలయ్యే ‘వరుణ్‌ డాక్టర్‌’ కథ నవ్విస్తుంది- శివకార్తికేయన్‌ 
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘రెమో’, ‘సీమ రాజా’, ‘శక్తి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘వరుణ్‌ డాక్టర్‌’. ఇప్పుడు తమిళ స్టార్‌ హీరో విజయ్‌ ‘బీస్ట్‌’కు దర్శకత్వం వహిస్తున్న నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కించిన చిత్రమిది. కె.జె.ఆర్‌. స్టూడియోస్‌ అధినేత కోటపాడి జె. రాజేష్‌… గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌.కె. ప్రొడక్షన్స్‌తో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయదశమి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్‌ 9న ‘డాక్టర్‌’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా శివ కార్తికేయన్‌ హైదరాబాద్‌ వచ్చారు. తెలుగు సినీ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలివీ….

*ప్రశ్న: ఇతర డాక్టర్లకు, ఈ ‘డాక్టర్‌’కు వ్యత్యాసం ఏమిటి?*
జవాబు: ‘డాక్టర్‌’ గురించి పూర్తిగా తెలియాలంటే… సినిమా చూడాలి. ప్రతి డాక్టర్‌ ఆపరేషన్‌ చేస్తారు. ఈ డాక్టర్‌ చేసే ఆపరేషన్‌ డిఫరెంట్‌. హీరో పేరు వరుణ్‌. అతను ఆర్మీ డాక్టర్‌. సొంతూరుకు వచ్చి ఏం చేశాడు? ఎందుకు చేశాడు? అనేది కథ. ట్రైలర్‌లో చూపించినట్టు హ్యూమన్‌ ట్రాఫికింగ్‌, ఆర్గాన్‌ ట్రాఫికింగ్‌ సినిమాలో ఉన్నాయి. అవి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది సినిమాలో చూడాలి.

*ప్రశ్న: ట్రైలర్‌ చూస్తుంటే స్టయిలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంది. ఈ జానర్‌లో మీరు నటించిన తొలి సినిమా ఇదే అనుకోవచ్చా?*
జవాబు: యాక్షన్‌, థ్రిల్‌ మూడ్‌లో సినిమా ఉంటుంది. కానీ, సినిమాలో ఎక్కువ ఫైట్స్‌ లేవు. రెండు ఫైట్స్‌ మాత్రమే ఉన్నాయి. హీరో, విలన్‌ మధ్య థ్రిల్‌ మూమెంట్స్‌ చాలా ఉంటాయి. నేరుగా కొట్టుకోరు. కానీ, ఇద్దరి మధ్య మైండ్‌ గేమ్‌ నడుస్తుంది. ఫిజికల్‌ ఫైట్‌ కాకుండా… మెంటల్‌ ఫైట్‌లా సినిమా ఉంటుంది. ఎవరు తెలివైనవారు అనే అంశం మీద నడుస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే… కొంచెం హ్యూమర్‌, కొంచెం థ్రిల్‌ ఇస్తుంది.

*ప్రశ్న: సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి!*
జవాబు: పోస్టర్‌ చూస్తే… నాతో పాటు చాలామంది నటీనటులు కనిపిస్తారు. ప్రతి పాత్రకు ఓ పర్పస్‌ ఉంటుంది. వాళ్లు సినిమా అంతా ఉంటారు. వాళ్లందరూ కామెడీ చేస్తారు… నేను తప్ప! నా పాత్ర సీరియస్‌గా ఉంటుంది. ట్రైలర్‌ చూస్తే… అందులో ఎటువంటి ఎమోషన్‌ లేకుండా కనిపిస్తానో, అలా!  వరుణ్‌ పాత్ర భావోద్వేగాలను బయటకు చూపించదు. ఎప్పుడూ నవ్వడు, ఏడ్వడు, కోప్పడడు. ఎటువంటి ఎమోషన్‌ లేకుండా నటించడం చాలా కష్టం. ఈ సినిమాలో నాకు ఎదురైన ఛాలెంజ్‌ అదే. కామెడీ సన్నివేశాలు చిత్రీకరించేప్పుడు నేను నవ్వితే… నెల్సన్‌ అరిచేవాడు. ‘నువ్విలా చేస్తే సీన్‌ రెండో రోజు చేయాలి. అప్పుడు ప్రొడక్షన్‌ కాస్ట్‌ పెరుగుతుంది. ఓకేనా?’ అని అడిగితే… మౌనంగా ఉండేవాడిని.

*ప్రశ్న: హీరోయిన్‌ ప్రియాంకా అరుల్‌ మోహన్‌, మీకు మధ్య లవ్‌ ట్రాక్‌ ఎలా ఉంటుంది?*
జవాబు: లవ్‌ ఎపిసోడ్‌ పెద్దగా ఉండదు. హీరో హీరోయిన్‌ మధ్య బ్రేకప్‌తో సినిమా ప్రారంభమవుతుంది. అంతకన్నా ఎక్కువ చెప్పలేను.

*ప్రశ్న: తమిళ వెర్షన్‌లో రెండు పాటలను మీరు రాశారు. ‘సో బేబీ…’ పాటకు ముందు అనిరుధ్‌, దర్శకుడితో డిస్కషన్‌ చేసిన వీడియో విడుదల చేశారు!*
జవాబు: (నవ్వుతూ…) జనరల్‌గా మేం మాట్లాడుకునేదాంట్లో 10 శాతం మాత్రమే చూపించాం. మా డిస్కషన్స్‌ అలానే ఉంటాయి. ఫస్ట్‌ ‘చెల్లమ్మ’ (తెలుగులో ‘చిట్టమ్మ’) పాట రాశా. తర్వాత ‘సో బేబీ… చాలామందితో రాయించాం. కుదరలేదు. నువ్వు రాయి’ అన్నారు. ట్రై చేశా. ‘చెల్లమ్మ’ సాంగ్‌ ముందు సినిమాలో అవసరం లేదు. ఎందుకంటే… బ్రేకప్‌తో మొదలవుతుందని చెప్పా కదా! అనిరుధ్‌ ‘సాంగ్‌ ఎక్కడ పెడతారు?’ అని అడిగారు. ‘అది తర్వాత చూద్దాం! ముందు నువ్వు చెయ్‌’ అని చెప్పాం. హ్యాపీగా రాశా. సినిమాలో మంచి సందర్భం కుదిరింది. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. వీడియో చూసి ‘బుట్టబొమ్మ’లా ఉందని చెబుతున్నారు.

*ప్రశ్న: కథ విన్నాక సినిమా నిర్మించాలనుకున్నారా? ముందే హీరోగా, నిర్మాతగా చేయాలనుకున్నారా?*
జవాబు: దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ నా క్లోజ్‌ ఫ్రెండ్‌. టీవీలో నేను షోస్‌ చేసినప్పటి నుంచి తెలుసు. నేను 2007లో టీవీ కెరీర్‌ స్టార్ట్‌ చేస్తే… ఆ షోను నెల్సన్‌ డైరెక్ట్‌ చేశాడు. తనపై నాకున్న నమ్మకమే సినిమా ప్రొడ్యూస్‌ చేయడానికి కారణం. సినిమా ఫస్ట్‌ కాపీ వరకూ ప్రొడ్యూస్‌ చేయడం నా పని. ఆ తర్వాత మొత్తం విడుదల వ్యవహారాలు కె.జె.ఆర్‌ స్టూడియోస్‌ అధినేత కోటపాడి జె. రాజేష్‌ చూస్తారు.

*ప్రశ్న: ఓటీటీలో ‘డాక్టర్‌’ విడుదల కానుందని చాలా వార్తలొచ్చాయి. ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారా?*
జవాబు: కరోనా తొలి దశలో వేచి చూడాలనుకున్నాం. అప్పటికి 80 శాతం చిత్రమే పూర్తయింది. ఫిబ్రవరికి సినిమా పూర్తయింది. విడుదల గురించి ఆలోచిస్తున్న టైమ్‌లో సెకండ్‌ వేవ్‌ వచ్చింది. ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు. అప్పుడు కోటపాడి జె. రాజేష్‌తో ‘మీకు ఏది రైట్‌ అనిపిస్తే అది చేయండి’ అని చెప్పాను. ఆయన థియేటర్లలో విడుదల చేయడానికి మొగ్గుచూపారు. ఓటీటీ కోసం కాదు… థియేటర్ల కోసమే సినిమా చేశాం.

*ప్రశ్న: తెలుగులో కరోనాకు ముందు విడుదలైన చివరి సినిమా మీదే… ‘శక్తి’. మళ్లీ ఆ సినిమా నిర్మాత కోటపాడి జె. రాజేష్‌ ‘వరుణ్‌ డాక్టర్‌’ను విడుదల చేస్తున్నారు. ఆయనతో మీ అసోసియేషన్‌ గురించి…*
జవాబు: అవును… లాక్‌డౌన్‌కు కొన్ని రోజుల ముందు తెలుగులో ఆ సినిమా విడుదలైంది. దానికి మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు ఆయన్ను అప్రిషియేట్‌ చేయాలి. లేదంటే ఓటీటీకి సినిమా వెళ్ళేది. తమిళనాడులో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆయన్ను అప్రిషియేట్‌ చేస్తున్నారు. అక్కడ సెకండ్‌ వేవ్‌ తర్వాత విడుదలవుతున్న భారీ సినిమా ఇదే. ఇన్నాళ్ళూ ఆన్‌లైన్‌ క్లాసులతో పిల్లలతో ఇంట్లో ఉన్న పేరెంట్స్‌ కూడా సినిమా చూడటానికి థియేటర్లకు వస్తారని నమ్ముతున్నా.

*ప్రశ్న: త్వరలో తెలుగు సినిమా చేయబోతున్నారని విన్నాం. ఎప్పుడు ఆ సినిమా మొదలు కానుంది?*
జవాబు: నిర్మాతలే అధికారికంగా సినిమా వివరాలు ప్రకటిస్తారు. ఆ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటున్నా. నాకు తెలుగు కొంచెం వచ్చు. మీరు మాట్లాడేది అర్థమవుతుంది. నెక్ట్స్‌ టైమ్‌ హైదరాబాద్‌ వస్తే… పూర్తిగా తెలుగులో మాట్లాడతా. ఈ సినిమా నా ప్లాన్‌లో లేదు. సెకండ్‌ వేవ్‌లో ఓ ఫ్రెండ్‌ ‘ఇటువంటి కథ ఉంది’ అని చెప్పాడు. దర్శకుడికి నేను చేయగలననే నమ్మకం ఉంది. ఓకే చేశా. ఈ సినిమా చేయడానికి హీరోయిన్లందరూ నాకు స్ఫూర్తి. వాళ్లు ఓ రోజు చెన్నైలో, మరో రోజు హైదరాబాద్‌లో, ముంబైలో చిత్రీకరణ చేస్తారు. డైలాగులు రాసుకుని, మీనింగ్‌ తెలుసుకుని ప్రాక్టీస్‌ చేస్తారు. నేనూ అలా కష్టపడాలని అనుకుంటున్నా.

Previous Post

పవన్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకోలేదు ; సజ్జల

Next Post

విడుదలకి సిద్ధమవుతున్న కార్తికేయ ‘రాజా విక్ర‌మార్క’

Next Post
విడుదలకి సిద్ధమవుతున్న కార్తికేయ ‘రాజా విక్ర‌మార్క’

విడుదలకి సిద్ధమవుతున్న కార్తికేయ 'రాజా విక్ర‌మార్క'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్
movies

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

by admin
October 3, 2026
0

...

Read more
సీనియర్ దర్శకుడు  బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

సీనియర్ దర్శకుడు బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

October 3, 2026
‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

October 2, 2026
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In