• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

‘విశాలాక్షి’ సినిమా ట్రైలర్ విడుదల

admin by admin
June 24, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

శ్రీ లక్ష్మి నరసింహ సినీ క్రియేషన్స్ పతాకం పై ‘నిమ్స్’ శ్రీహరి రాజు దర్శకత్వంలో రూపొందించిన ‘విశాలాక్షి’ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ లాబ్స్ లో సందడిగా జరిగింది.

సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ ట్రైలర్ లాంచ్ చేసారు. ఆయన మట్లాడుతూ.. ఈ విశాలాక్షి సినిమా ట్రైలర్ చూసాక ఇది దెయ్యం సినిమా అని అర్ధం అయ్యింది. దెయ్యం సినిమాలకి ప్రత్యేకంగా ప్రేక్షకులు ఉంటారు. నేను తీసిన దెయ్యం సినిమాలకి బాగా డబ్బులు వచ్చాయి. ఈ విశాలాక్షి సినిమాకి కూడా డబ్బులు వస్తాయి. ఈ చిత్ర దర్శకుడు శ్రీహరి రాజు గారు నిమ్స్ హాస్పిటల్ లో పని చేసారు. సినిమా రంగం నుండి ఎవరు హాస్పిటల్ కి వెళ్లిన ఎంతో సాహయం చేసేవారు. వారు రిటైర్ అయిన తర్వాత తన 40 ఏళ్ళ కలని నిజం చేసుకోవడానికి ఈ సినిమా తీశారు. ఈ సినిమా ఘన విజయ సాధిస్తుంది. ఆయన వరసగా సినిమాలు తీస్తారు. ఈ చిత్ర నిర్మాతలు ఎన్. వి. సుబ్బరాజు, డి. విజయకుమార్ రాజు, బి. శ్రీనివాసరెడ్డి, డి. శ్రీహరిరాజు, డి. ఎస్. హెచ్. దీప్తి అందరూ నా మిత్రులు. వారు సినిమా రంగంలో పెద్ద సక్సెస్ సాధిస్తారు. దర్శకుడైన మహేష్ చంద్ర ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. దర్శకుడు శ్రీహరి రాజుగారికి మహేష్ చంద్ర ఎంతో అండగా నిలిచారు. ట్రైలర్ లో రీ రికార్డింగ్ బాగుంది. ప్రేక్షకులకు భయం అనే అనుభూతి కలిగించిన సినిమాలు హిట్ అయ్యాయి. అదే కోవలో విశాలాక్షి సినిమా కూడా హిట్ అవుతుంది అని ఆశీర్వదించారు.

దర్శకుడు నిమ్స్ శ్రీహరి రాజు గారు మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం అమెరికాలో ఉన్నప్పుడు మా చుట్టూ కరోనా ఉధృతంగా ఉంది. కరోనా వస్తే సినిమా తియ్యాలనే కల నెరవేరకుండానే వెళ్ళిపోతానేమో అని భయపడ్డాను. దేవుడి దయ వలన స్నేహితుల సహకారంతో విశాలాక్షి సినిమా తీసాను. ఎడిటింగ్ దశలో డబ్బింగ్ దశలో ఇప్పుడు ట్రైలర్ చూసిన వారంతా చాలాబాగుంది అని అభినందిస్తున్నారు. ఈ సినిమా రూపకల్పనలో మహేష్ చంద్ర గారి సహకారం మరువలేనిది. ఈ చిత్ర నిర్మాతలు నా మిత్రులే. ఈ సందర్భంగా వారికి ధన్యవాదములు అని చెప్పారు.
ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన మహేష్ చంద్ర మాట్లాడుతూ.. ఈ డైరెక్టర్ నిమ్స్ శ్రీహరి రాజు గారికి అనుభవం లేకపోయినా.. సినిమా మీద పూర్తి అవగాహన ఉంది. అమెరికాలో ఉన్నప్ప్పుడు నాకు కథ చెప్పి పది నిమిషాల నిడివితో ఫోన్ లో షూట్ చేసి ఎడిట్ చేసి, సెండ్ చేసి నాకు చూపించారు. అది చాలా బాగుంది. ఆ తర్వాత ఈ సినిమా తీశారు. ఆయనకు నా వంతు సహకారం అందించాను. ఈ సినిమాలో నేను సాఫ్ట్ వెర్ ఇంజినీర్ గా నటించాను అని చెప్పారు.

హీరో సూర్య తేజ, సంగీత దర్శకుడు సంతోష్ కావల, కొరియోగ్రాఫ్ఫ్ర్ సతీష్ రాజ్, కెమెరా మ్యాన్ కుర్ర చింతయ్య ఈ సినిమాకి పని చెయ్యడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు. నిర్మాతలు: ఎన్. వి. సుబ్బరాజు, డి. విజయకుమార్ రాజు, బి. శ్రీనివాసరెడ్డి, డి. శ్రీహరిరాజులు మాట్లాడుతూ.. సినిమా మంచి క్వాలిటీతో తీసాం, త్వరలోనే సెన్సార్ పూర్తి చేసి రిలీజ్ చేస్తాం అన్నారు.

ఈస్ట్ వెస్ట్ ఎంటెర్టైనెర్స్ సంస్థ సీఈఓ రాజీవ్ ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత ఓటిటిలో రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ ఫంక్షన్ కి దర్శకుడు వీర శంకర్, బాబ్జి హాజరై శుభాకాంక్షలు తెలియజేసారు.

ఆర్టిస్టులు
మహేష్ చంద్ర, శ్రీదేవి (విశాలాక్షి), సూర్యతేజ్, జైష్యా శ్రావణి, బేబి నిత్యశ్రీ, బేబీ అర్షిత, మాస్టర్ అవిన్ కార్తికేయ, మాస్టర్ అర్హన్, గోపాలకృష్ణ. బి, అచ్యుతలక్ష్మీ, రాజు ఎర్రంశెట్టి, ముదునూరి శ్రీనివాసరాజు, వేగేశ్న సత్యనారాయణరాజు (ఆత్రేయపురం మాస్టర్), డేవిడ్, నాయుడు మొరం, అభి మాస్టర్, నిమ్స్ రాము, మాచర్ల రమేష్, వెంకటరత్నం. సి. హెచ్, సాగి వర్మ, చొప్పల రామారావు, భానుమతి, లక్ష్మీ ప్రసాద్ కట్టా, నిమ్స్ శ్రీహరిరాజు, గంగాజలం.
టెక్నిషియన్స్
కెమెరా : కుర్రా చింతయ్య(చిన్న), సంగీతం : సంతోష్ కవల, ఎడిటర్ : శివ నిర్వాణి, కొరియోగ్రఫీ : సతీష్ రాజ్, పాటలు : ఇమ్రాన్ శాస్త్రి, నిమ్స్ శ్రీహరి రాజు.
దర్శకత్వ శాఖ: చిరంజీవి, బాలకృష్ణ, దొరబాబు, వైష్ణవి, చిత్ర నిర్మాణ సహకారం: సి. హెచ్. శ్రీనివాస్, నిర్మాతలు: ఎన్. వి. సుబ్బరాజు, డి. విజయకుమార్ రాజు, బి. శ్రీనివాసరెడ్డి, డి. శ్రీహరిరాజు, డి. ఎస్. హెచ్. దీప్తి.
కథ- మాటలు- స్క్రీన్ ప్లే – దర్శకత్వం: నిమ్స్ శ్రీహరి రాజు.

Previous Post

హృదయాన్ని కదిలించే ప్రేమకథ ‘ సదా నన్ను నడిపే ‘

Next Post

యూత్ ఫుల్ ఎంటర్టైనర్… పెళ్లికూతురు పార్టీ

Next Post

యూత్ ఫుల్ ఎంటర్టైనర్... పెళ్లికూతురు పార్టీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?
politics

ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?

by admin
August 19, 2026
0

...

Read more
రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

August 18, 2026
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

August 18, 2026
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

August 18, 2026
“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

August 17, 2026
దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

August 16, 2026
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

August 14, 2026
ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

August 12, 2026
లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

August 12, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In