• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఐరావతం ఓ మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్..!!!

admin by admin
May 8, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వుంటుంది. కొంచం కమర్షియల్ టచ్ కూడా ఇస్తే యూత్ ని కూడా ఆకర్షించొచ్చు. ఎంగేజింగ్ కథాకథనాలను పక్కాగా ప్లాన్ చేసుకుంటే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. నిర్మాతలు, దర్శకులు కూడా ఇలాంటి స్టోరీస్ నే ఎంచుకుని ప్రేక్షకులను థియేర్లకు రప్పిస్తున్నారు. తాజాగా విడుదలైన ఐరావతం మూవీ కూడా… ఇలాంటి క్రైం థ్రిల్లర్ మూవీనే. ఇది ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినీమా ప్రేక్షకులను ఏమాత్రం థ్రిల్ కు గురిచేసిందో చూద్దాం పదండి.

కథ: శ్లోక (తన్వీ నేగి) ఓ బ్యూటీషియన్. ఆమెకు చిక్కు (అమర్ దీప్ చౌదరి) బాయ్ ఫ్రెండ్. శ్లోకకి పుట్టినరోజు కానుకగా ఓ వైట్ కెమెరాను బహుమతిగా ఇస్తాడు. ఆ కెమెరా ప్రత్యేకత ఏమిటి అంటే… శ్లోక తన వీడియో తీసుకుంటే… తనను పోలిన మరో అమ్మాయి ప్రిన్సీ అనే అమ్మాయి వీడియో ప్లే అవుతుంది. ఇలా ప్లే అయిన ప్రతి సారి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ క్రైం థ్రిల్లర్ స్టోరీ ప్లే అవుతుంది. ఆ కెమెరా ప్రత్యేకత గురించి, ప్రిన్సీ గురించి.. మాయా (ఏస్తర్) శ్లోకకి చెబుతుంది. అలా కెమెరా వల్ల శ్లోక, ప్రిన్సీ మంచి స్నేహితులు అవుతారు. ప్రిన్సీ మోడల్ గా పనిచేస్తూ వుంటుంది. ఆమెకు సన్నీ అనే బాయ్ ఫ్రెండ్ వుంటాడు. అతను మంచి ఫ్యాషన్ ఫొటో గ్రాఫర్. అయితే శ్లోక, ప్రిన్సీలలో ఎవరో ఒకరు చనిపోవడం ఖాయం ఆని కూడా మాయా (ఎస్తర్) చెబుతుంది. మరోవైపు సీరియల్ మర్దర్లతో పోలీసులకు ఓ సవాల్ గా మారి వుంటాడు ఓ సైకో కిల్లర్. అసలు ఆ తెల్ల కెమెరా అసలు కథ ఏంటి? శ్లోక, ప్రిన్సీ లలో ఎవరు చనిపోయారు? వాళ్ళని చంపాల్సిన అవసరం ఎవరికుంది? సైకో కిల్లర్ ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ మూవీస్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారనడంలో సందేహం లేదు. ఇది న్యూ ఎజ్ థ్రిల్లర్. కానీ ఐరావతం సినిమాని మాత్రం ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే సినీమా మొదలైనప్పటి నుంచి చివరి క్షణం వరకూ సస్పెన్స్ ట్విస్టులతో అలరిస్తుంది. ఓ వైపు స్టోరీ నెరేషన్ సగటు ప్రేక్షకుడికి కొంత కన్ఫ్యూషన్ కలిగించినా.. చివరకు క్లైమాక్స్ లో ఓ క్లారిటీ వస్తుంది. అక్రమ సంబంధాలతో నిర్లక్ష్యానికి గురైన ఓ అబ్బాయి… చివరకు ఎలా మారాడు అనేది చూపించి మెసేజ్ కూడా ఇచ్చాడు. తాను బాగా ఇష్టపడే అమ్మాయి ఇతరులతో చనువుగా వుండటం భరించలేక… ఎలా హంతకునిగా మారినాడు అనేది ఎంతో థ్రిల్లింగ్ గా చూపించాడు దర్శకుడు. ఐరావతం ఓ మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్. ఇలాంటి జోనర్స్ ఇష్టపడే వారు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీకెండ్ లో డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే వారికి ఐరావతం మూవీ ఓ మంచి చాయిస్.

హీరో పాత్ర పోషించిన అమర్ దీప్ చౌదరి ఇప్పటికే సీరియల్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయంగ్ వుంది. అందుకే ఈ సినిమాని మాంచి ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ అండ్ కంటెంట్ తో పబ్లిసటీ పీక్స్ కి తీసుకెళ్లారు. చిక్కు పాత్రలో పక్కింటి అబ్బాయిలా నటించి మెప్పించాడు. హీరోయిన్ ద్విపాత్రాభినయంలో బాగా గుర్తుండి పోయే పాత్రను పోషించింది. ఓ వైపు బ్యుటీషియన్ గా… మరోవైపు మోడల్ గా మోడ్రన్ పాత్రను పోషించి మంచి మార్కులే కొట్టేసింది. సైకో కిల్లర్ పాత్రలో సన్నీగా నటించిన అరుణ్ జాను  ఔరా అనిపంచారు. అతనికి జోడీగా నటించిన ఎస్తర్ మాయగా మరోవైపు వేద పాత్రలో చాలా డీసెంట్ పాత్ర పోషించి ఆకట్టుకుంది. చివర్లో చర్చి ఫాదర్ క్యారెక్టర్ లో సప్తగిరి కనిపించి ప్రేక్షకులను కాసేపు నవ్వించారు. మిగతా పాత్రన్నీ తమ తమ పరిధిలో నటించి తమ పాత్రలకు న్యాయం చేశారు.

డైరెక్టర్ సుహాస్ ఎంచుకున్న కథ, కథనాలు మంచి డ్రైవింగ్ పాయింట్స్. ఆద్యంతం ట్విస్టులతో స్క్రీన్ ప్లేని నడిపిన తీరు ఉత్కంఠను రేపుతుంది. చివరి వరకు సస్పెన్స్ ని కొనసాగించిన తీరు ఆకట్టుకుంటుంది. పెద్దగా ప్యాడింగ్ కి ప్రాధాన్యత ఇవ్వకపోయినా.. కథ కథనాలను నమ్ముకుని ఎక్కడా బోరింగ్ అనిపించకుండా సినిమాని తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. సత్య కశ్యప్ అందించిన రెండు పాటలు బాగున్నాయి. కార్తీక్ కడగండ్ల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ థ్రిల్లర్ మూవీకి ఎలా వుండాలో అలానే ఉంది. ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆర్.కె.వల్లెపు సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. ఆర్టిస్టుల ను చాలా అందగా చూపించారు. విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ క్రిస్పీగా వుంది. ఎడిటర్ సురేష్ దుర్గం సీన్స్ ని… ఏర్చి కూర్చడంలో తన ప్రతిభను చూపించాడు. నిర్మాతలు రాంకీ పలగని, లలిత కుమారి, బాలయ్య చౌదరి సినిమాను మంచి అత్యుత్తమ నిర్మాణ విలువలతో నిర్మించారు. ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదు. గో అండ్ వాచ్ ఇట్..!!!

రేటింగ్: 3

Previous Post

దాసరి జయంతి సందర్భంగా పాన్ ఇండియా దర్శకులకు సత్కారం!!

Next Post

డైలాగ్ కింగ్ సాయికుమార్  చేతులమీదుగా విడుదలైన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ‘ధగడ్ సాంబ’ ట్రైలర్

Next Post

డైలాగ్ కింగ్ సాయికుమార్  చేతులమీదుగా విడుదలైన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు 'ధగడ్ సాంబ' ట్రైలర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

సన్ ఆఫ్ మూవీ రివ్యూ: కట్టిపడేసే తండ్రీకొడుకుల బంధం
movies

సన్ ఆఫ్ మూవీ రివ్యూ: కట్టిపడేసే తండ్రీకొడుకుల బంధం

by admin
February 28, 2026
0

...

Read more
పేలుడులో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం- సీఎం చంద్రబాబు

పేలుడులో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం- సీఎం చంద్రబాబు

February 28, 2026
హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

February 28, 2026
యూత్‌ఫుల్ లవ్ డ్రామాతో  హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై ప్రెస్టేజీయస్  ప్రాజెక్ట్ ప్రారంభం

యూత్‌ఫుల్ లవ్ డ్రామాతో హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై ప్రెస్టేజీయస్ ప్రాజెక్ట్ ప్రారంభం

February 28, 2026
హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

February 28, 2026
రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

February 28, 2026
KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు..100 కోట్ల డాల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌

KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు..100 కోట్ల డాల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌

February 28, 2026
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్

February 28, 2026
సుహాసిని, వినోద్ కుమార్ ఆవిష్కరించిన ‘ఓ మాట అనుకుందామా!’ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్!

సుహాసిని, వినోద్ కుమార్ ఆవిష్కరించిన ‘ఓ మాట అనుకుందామా!’ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్!

February 27, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In