ఏపీ రాజధాని అమరావతికి రుణం ఇవ్వొద్దు…వైకాప కుట్ర!

అమరావతితో ఎలాంటి సంబంధమూ లేని కెనడాకు చెందిన ఎన్జీవో ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేయడం వింతగా ఉంది . దీనివెనుక వై కా పా రాజకీయ కోణంఉంది ‘అమరావతి నిర్మాణంపై మొదటి నుంచి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. పర్యావరణం దెబ్బతింటుందంటూ ఎన్‌జీటీలో పిటిషన్లు వేయడం, రుణం ఇస్తే తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ ప్రపంచబ్యాంకుకు సామాజికవేత్తలు లేఖలు రాయడం.. ఉద్దేశపూర్వకంగానే జరుగుతోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి వై కా పా అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. తాజాగా అమరావతితో ఎలాంటి సంబంధం లేని కెనడాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేసింది. అమరావతి నిర్మాణం కోసం రూ.3,324 కోట్లు కావాలని ఏపీ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ప్రపంచబ్యాంకును కోరింది. అప్పట్లో దీనిపై కొందరు సామాజికవేత్తలు ప్రపంచబ్యాంకుకు లేఖ రాశారు. అమరావతి నిర్మాణానికి రుణం ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. దీంతో ప్రపంచబ్యాంకు ప్రతినిధులు అమరావతిలో పర్యటించి, సామాజికవేత్తల అభ్యంతరాల్లో వాస్తవం లేదని నిర్ధారణకు వచ్చారు. తాజాగా కెనడాకు చెందిన స్వచ్ఛంద సంస్థ అమరావతిలో భూసేకరణకు వ్యతిరేకంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రపంచబ్యాంకు రుణ మంజూరుపై అభ్యంతరాలు తెలిపింది.

కెనడా సంస్థ పిటిషన్‌పై కేంద్రం ప్రపంచబ్యాంకుకు గట్టిగా జవాబిచ్చింది. భూసేకరణే జరగనప్పుడు బాధితులు ఎక్కడ నుంచి వస్తారని ప్రశ్నించింది. అమరావతికి కావాల్సిన భూమిని అక్కడి ప్రజలు ఇష్టపూర్వకంగానే భూసమీకరణకు ఇచ్చారని స్పష్టం చేసింది. ‘మీకు రుణం ఇవ్వడంలో అభ్యంతరాలుంటే మరో సంస్థ నుంచి రుణం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ప్రపంచబ్యాంకుకు కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం ఇచ్చిన సమాధానంతో ప్రపంచబ్యాంకు పునరాలోచనలో పడిందని, రుణ మంజూరుకు సానుకూలత వ్యక్తం చేసింది. మరో సంస్థ నుంచి రుణం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిపాదించింది . అమరావతి నిర్మాణానికి ఇచ్చే రుణంపై 9 శాతం వడ్డీని చెల్లించాలని ప్రపంచబ్యాంకు తాజాగా ప్రతిపాదించింది. సాధారణంగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి ప్రభుత్వాలు తీసుకునే రుణాలకు 5 శాతానికి మించి వడ్డీరేట్లు ఉండవు. ఈ రేటుతో రుణం తీసుకుంటే పెరిగిన ప్రాజెక్టు ఖర్చును, పన్నురేట్లలో హెచ్చుతగ్గులను రుణం తీసుకున్న రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. ప్రపంచబ్యాంకు వడ్డీ రేటును 9 శాతానికి పెంచిన నేపథ్యంలో.. ప్రాజెక్టు ఖర్చులో పెరుగుదల, పన్ను హెచ్చుతగ్గుల భారాన్ని ప్రపంచబ్యాంకే భరించాలన్న షరతులు !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *