డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని జ‌గ‌న్ పాద‌యాత్ర కూలీల గోల‌

40

వైసీపీ అధినేత ప్రజాసంకల్ప యాత్ర పేరుతో జనాల్లో తిరుగుతున్నాపెద్దగా ఎవరూ పట్టించుకోవడంలేదు. సరికదా పెద్దగా జనం రాకపోవడంతో యాత్ర చప్పగా సాగుతోంది. ప్రతిరోజు వేలమంది వస్తారనే ఆశతో భారీ స్థాయిలో భోజనాలు ఏర్పాటు చెయ్యడం జనం లేక వండిన వంటలు పారబోయడం నిత్య కృత్యంగా మారింది. అలాగే.. యాత్రలో జనం కూడా పెద్దగా కనిపించకపోవడంతో మీడియా లో సరిగా ఫోకస్ అవ్వదనే ఉద్దేశంతో బయటి నుంచి డబ్బులు ఇచ్చి మరీ జనాలను తీసుకొస్తున్నారు. కూలి డబ్బులతో పాటు, మద్యం, బిర్యానీ పొట్లం కూడా ఆఫర్ చేస్తున్నారు.

జగన్ పాదయాత్ర జరుగుతున్న తీరుపై అధికార పార్టీ నేతలు కూడా విమర్శలు చేస్తున్నా.. అవేమి పట్టించుకోకుండా వైసీపీ ముందుకెళ్తోంది. వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో మద్యం ఏరులై పారుతోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఇలాంటి నాయకుడు మద్యనిషేధం విధిస్తారా అని ప్రశ్నించారు.జగన్‌ మాటలు ప్రజలు నమ్మడం లేదన్నారు. జగన్‌ జీవితమంతా అబద్దాలేనని మండి పడ్డారు. సీఎం చంద్రబాబును తిట్టేందుకే జగన్‌ పాదయాత్ర చేపట్టారని ధ్వజమెత్తారు. సోమవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జగన్‌ పాదయాత్రలో ప్రజలెవ్వరూ పాల్గొనడం లేదని, కడప నుంచి పిలిపించుకున్న గూండాలే పాల్గొంటున్నారని ఆరోపించారు.

వారికి రోజూ రూ.300 నగదు, క్వార్టర్‌ మందు, బిర్యాని ఇస్తున్నారన్నారు. పగలు పాదయాత్ర, రాత్రి మందు, చికెన్‌, మటన్‌తో పండుగ చేసుకుంటున్నారన్నారు. పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అయిపోయినట్లు జగన్‌ కలలు కంటున్నారని, ఆయన కలలు ఎన్నటికీ నెరవేరవని అన్నారు. రాయలసీమలో పాదయాత్ర చేస్తున్న జగన్‌ ఇక్కడి సమస్యల గురించిగానీ, ఈ ప్రాంత అభివృద్ధి గురించి గానీ ఎక్కడైనా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. సీఎం రాష్ర్టాభివృద్ధికి చేస్తున్న కృషిని చూసి ప్రపంచ దేశాల నేతలు ప్రశంసిస్తున్నారని, అది చూసి జగన్‌ బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. అధికార పక్షం, ప్రతిపక్షం ఏంటో కూడా తెలియని స్థితిలో జగన్ ఉన్నారని సోమిశెట్టి విమర్శించారు.

పాదయాత్ర అనుకున్న స్థాయిలో జరగకపోవడంతో జగన్ తీవ్ర నిరాశలో ఉన్నట్లు కనిపిస్తోంది. డబ్బులిచ్చి మరీ జనాలని పోగుచేయడం వారికి సరిగ్గా భోజనం ఏర్పాట్లు చేయలేకపోవడంతో పాటు , డబ్బులు చెల్లించే విషయంలో తరచూ గొడవలు జరుగుతుండడంతో అది పెద్ద ప్రాబ్లెమ్ గా తయారయ్యింది పార్టీకి. పాదయాత్ర ముగిసిన ప్రాంతంలో జగన్ గురించి కాకుండా ఈ గొడవల గురించే చర్చించుకోవడం చూస్తుంటే వైసీపీకి ఈ పాదయాత్ర లాభం కంటే నష్టమే ఎక్కువ చేసేలా కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here