చంద్రబాబును చూస్తే ఊసరవెల్లి కూడా భయపడుతోంది:జగన్

24

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూస్తే ఊసరవెల్లి కూడా భయపడుతోందని వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా జరగని అవినీతి బాబు హయాంలో జరుగుతోందని, తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతి ఊరిలో మంచి నీరు దొరకుతుందో లేదో తెలీదు కానీ, మద్యం మాత్రం దొరకుతుందని, ఫోన్‌ చేస్తే ఇంటికి వచ్చి డెలివరీ చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. నాలుగేళ్లుగా పెట్రోలు, డీజిల్‌ మీద బాదుడు కనిపిస్తోందని, పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే రూ.7 ఎక్కువగా ఉందన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కనిగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే ‘అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో చంద్రబాబు మూడుసార్లు కరెంట్‌ చార్జీలు పెంచారు. విద్యుత్‌ బిల్లులకు భయపడి ఇంట్లో టీవీ కూడా ఆన్‌ చేయలేని పరిస్థితి వచ్చింది. బాబు అధికారంలోకి రాకముందు రూ100 వచ్చే కరెంట్‌ బిల్లు ఇప్పుడు రూ.500 నుంచి రూ.2వేల వరకూ వస్తోంది. అంతే కాదు రూ.10వేల పెనాల్టీ అంటూ ప్రజలను హింసిస్తున్నారు. పక్కనున్న ఊర్లో బంధువుల ఇంటికి వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ప్రజలు భయపడుతున్నారు. మూడుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారు. పండుగ వస్తే టికెట్లు కొత్త సినిమాకు బ్లా​క్‌లో అమ్మినట్లు అమ్మతున్నారు. నాన్నగారి హయాంలో రేషన్‌ దుకాణానికి వెళ్తే అన్ని సరుకులు ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం బియ్యం ఒక్కటే ఇస్తున్నారు. వాటిలో కూడా వేళ్లు పడట్లేదంటూ ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధరలేదు. పండించిన పంటకు ధర కోసం రైతన్నలు రోడ్డెక్కి ధర్నాలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. పొగాకు, కందులు, శనగకు కనీసం గిట్టుబాటు ధర లభించడం లేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జామాయిల్‌ రైతులకు క్వింటా రూ.4200 ఉంటే ఇప్పుడు రూ. 1800 కూడా రావడం లేదు. ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు పూర్తిగా రుణమాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here