రివ్యూ: విన్నర్… ఓ సారి చూసేయొచ్చులే!

195

WINNER-Movie-Apvarthaluతారాగణం: సాయిధరమ్ తేజ్ – రకుల్ ప్రీత్ సింగ్ – జగపతి బాబు – అనూప్ సింగ్ ఠాకూర్ – ముకేష్ రుషి – పృథ్వీ – వెన్నెల కిషోర్ – ఆలీ – రఘుబాబు తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు
కథ: వెలిగొండ శ్రీనివాస్
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్-ఠాగూర్ మధు
స్క్రీన్ ప్లే – దర్శకత్వం: గోపీచంద్ మలినేని
రేటింగ్: 2.75/5
సాయిధరమ్ తేజ్ కు ‘తిక్క’ రూపంలో పెద్ద బ్రేక్ పడింది. అంతకు ముందు సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ విజయాలతో మంచి ఊపుమీద వున్న విషయం తెలిసిందే. అలానే దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ‘పండగ చేస్కో’తో దెబ్బ తిన్నాడు. వీళ్లిద్దరూ హిట్టు కొట్టి తీరాలన్న కసితో చేసిన సినిమా ‘విన్నర్’. ఈ రోజే విడుదలైంది ఈ చిత్రం. మరి సాయిధరమ్ తేజ్ ఈసారైనా ‘విన్నర్’ అయ్యాడేమో చూద్దాం పదండి.
స్టోరీ: సిద్ధార్థ్ (సాయిధరమ్ తేజ్) చిన్నప్పుడే తండ్రి నుంచి దూరం అవుతాడు. అలా తండ్రి నుంచి చిన్నప్పుడే దూరం అయిన సిద్ధూ.. సొంతంగానే పెరిగి.. ఓ డైలీ న్యూస్ పేపర్లో క్రియేటివ్ హెడ్ గా పనిచేస్తుంటాడు. ఓ పార్టీలో సితార (రకుల్ ప్రీత్)ను చూసి ప్రేమలో పడతాడు. పెద్ద అథ్లెట్ కావాలని కలలు కంటున్న సితార.. సిద్ధార్థ్ అల్లరి కారణంగా తన కెరీర్ ను పక్కనబెట్టి వెంటనే హార్స్ రేసర్ అయిన ఆది (అనూప్ సింగ్)ను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఆ పెళ్లిని తప్పించుకునే క్రమంలో సితార చెప్పిన అబద్ధం కారణంగా సిద్ధార్థ్.. ఆదితో గుర్రపు పందెంలో పోటీ పడాల్సి వస్తుంది. అసలు గుర్రపు పందేలంటేనే పడని సిద్ధార్థ్.. సితార కోసం ఎలా కష్టపడ్డాడు…. ఆదిని ఎలా ఓడించాడు? చివరకు తన తండ్రి వద్దకు సిద్ధూ చేరుకున్నాడా? చిన్నప్పుడు తండ్రి నుంచి సిద్ధూ ఎందుకు దూరమయ్యాడు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్టోరీ విశ్లేషణ: సాధారణంగా స్పోర్ట్స్ బేస్డ్ స్టోరీలంటే… ఏ బాక్సింగో.. క్రికెట్టో.. కబడ్డీనో.. ఇంకోటో పెడుతుంటారు. కానీ ‘విన్నర్’లో గుర్రపు రేసులు పెట్టారు. అదీ మిగతా సినిమాలకు ఈ సినిమాకు తేడా. క్రికెట్టో కబడ్డీనో అయితే మనకు ఈజీగా కనెక్ట్ అవుతాయి. అయితే వీటిని చూసి చూసి ప్రేక్షకులు కూడా బోర్ గా ఫీలవుతున్నారు. అందుకే ఈ సారి రేస్ కోర్స్ ను ఆదారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించాడు గోపీ చంద్ మలినేని. ‘విన్నర్’కు నేపథ్యంగా గుర్రపు రేసులు ఎంచుకోవడంతో ఆటకు సంబంధించిన వినోదం పెద్దగా లేకపోయినా… ఆలీ రూపంలో ఓ జాకీని తీసుకొచ్చి కాసేపు నవ్వించారు. హీరో ఇంట్రడక్షన్ సీన్ కొంత రొటీన్ గా వున్నా… అక్కడక్కడా మెరిసిన కామెడీ మెరుపులు.. రెండు మూడు ఆకర్షణీయమైన పాటలు మాస్ ను బాగా మెప్పిస్తాయి. పాటలు.. ఫైట్లు.. గుర్రపు రేసు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తాయనడంలో సందేహం లేదు.
గోపీచంద్ మలినేని మొదట్నుంచి మాస్ మసాలా సినిమాలే చేస్తూ వస్తున్నాడు. ఐతే ఇంతకుముందు అతడి కథల్లో మరీ కొత్తదనం లేకపోయినా.. ఉన్నంతలో ఆసక్తికర మలుపులుండేవి. ట్విస్టులతో.. మంచి ఎంటర్టైన్మెంట్ తో సినిమాల్ని ఆసక్తికరంగా నడిపించేవాడు. డాన్ శీను.. బలుపు లాంటి సినిమాలు అలా ఎంటర్టైన్ చేసినవే. రామ్ తో చేసి ‘పండగ చేస్కో’ కూడా బాగానే ఫన్ ఇచ్చింది. ఎందుకో విన్నర్ లో గత చిత్రాల్లాగ కావాల్సినంత కంటెంట్.. కామెడీ తగ్గిందేమో అనిపిస్తుంది. అయితే ఓ వరాల్ గా మాస్ ఆడియన్స్ కి మాత్రం ఫుల్ మీలే ఇచ్చాడు దర్శకుడు.
సాయిధరమ్ తేజ్ ఎప్పట్లాగే ఎనర్జిటిగ్గా కనిపించాడు. అతడి లుక్ బాగుంది. నటన రొటీన్ గా వున్నా… కొన్ని మాస్ యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే మంచి డ్యాన్సర్ యైన తేజుతో డ్యాన్సులు చేయించలేకపోవడం కచ్చితంగా కొరియోగ్రాఫర్స్ ఫెయిల్యూరే అని చెప్పొచ్చు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ బాగుంది. ఇందులో గ్లామర్ డోస్ బాగా పెంచింది. గతంలో ఏ సినిమాలోనూ లేనంత సెక్సీగా ఇందులో కనిపించింది. జగపతి బాబు నటన ఓకే. విలన్ అనూప్ సింగ్ ఠాకూర్ నటన బాగుంది. విలన్ పాత్రకు తగ్గ ఆహార్యం బాగా పండించాడు. సింగం సుజాతగా పృథ్వీ.. పద్మగా వెన్నెల కిషోర్ పంచ్ లు పేల్చారు. ఆలీ పాత్ర బాగుంది. ముకేష్ రుషి.. సురేష్.. రఘుబాబు నటన పర్వాలేదు. సాంకేతిక నిపుణుల గురించి చెప్పాల్సి వస్తే… తమన్ పాటలు పర్వాలేదు. అనసూయ… పిచ్చోణ్ని అయిపోయా.. ఓ సితార పాటలు మంచి కిక్కిస్తాయి. మిగతా పాటలేవీ కూడా అంతగా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఛోటా కె.నాయుడు కెమెరా పనితనం ఆకట్టుకోదు. అబ్బూరి రవి మాటలు పర్వాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here