రివ్యూ : ఉందా.. లేదా…? వెరీ ఇంట్రెస్టింగ్

409

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కి మంచి రెస్పాన్స్ వుంటుంది. అందుకే కొత్త డైరెక్టర్లు ఇలాంటి జోనర్లో మూవీస్ ని తెరకెక్కించడానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటి సినిమాల వల్ల తమకు మంచి పేరు రావడంతో పాటు… నిర్మాతకూ నాలుగు డబ్బులు వస్తాయని దర్శకులు భావించడమే ఇందుకు కారణం. వీటికి తోడు.. దెయ్యం.. ఆత్మ కాన్సెప్ట్ తోడైతే.. బొమ్మ హిట్టే. అందుకే ఇప్పుడు ‘ఉందా.. లేదా..?’ అనే మూవీ మన ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ఆదరణ పొందిందో లేదో చూద్దాం పదండి.

కథ: రాజా (రామకృష్ణ) డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. అతని స్నేహితుడు పనిచేసే ఛానెల్ కు డాక్యుమెంటరీలు చేస్తుంటాడు. అలాంటి సమయంలో నందిని (అంకిత) పరిచయమౌతుంది. నందిని డాక్టర్. అనుకోకుండా పరచయమై మంచి ఫ్రెండ్స్ గా మారతారు. ప్రేమలో పడతారు. మరో వైపు రాజా హరిశ్చంద్ర హాస్టర్ లో రుబీనా అనే అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. ఆత్మలు, దెయ్యాల కారణంగానే సూసైడ్ చేసుకున్నారని ప్రాథమికంగా నిర్దారిస్తాడు పోలీస్ ఆఫీసర్ (రామ్ జగన్). అయితే రుబీనాను తన తమ్ముడు ప్రేమించడం.. అతను రుబీనా చనిపోయిందని కోమాలోకి వెళ్తాడు. ఇదేదేగా ఉండడంతో… రాజాను హాస్టల్ మీద ఓ డాక్యుమెంటరీ తీయమంటాడు. అలా రాజా డాక్యుమెంటరీ తీయడం మొదలు పెట్టిన తర్వాత పలు ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఇంతకూ ఆ హాస్టల్ లో దెయ్యాలు ఉన్నాయా లేవా అనేది అసలు కథ.

విశ్లేషణ: రామకృష్ణ, అంకిత జంటగా జయకమల్ ఆర్ట్ బ్యానర్‌పై అమనిగంటి వెంకట శివప్రసాద్‌ దర్శకత్వంలో అయితం ఎస్.కమల్ నిర్మించిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ఇది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో విభిన్నమైన కథ, కథనాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమాకు ముందు విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఓ హాస్టల్ గదిలో చనిపోయిన అమ్మాయి… తన ఆత్మను అక్కడ వొదిలిందా లేదా? అనే సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఆద్యంతం ఉత్కంఠతతో ప్రేక్షకుణ్ని కుర్చీలో కూర్చోబెడుతుంది. ప్రేక్షకులు మెచ్చేలా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
రామకృష్ణ కొత్త గా హీరోగా ఇంట్రడ్యూస్ అయినప్పటికీ చాలా బాగా చేశాడు. ఎవ్వరినీ ఇమిటేట్ చేయకుండా సహజంగా నటించాడు. తనకు ఈ సినిమా నటుడిగా ఎంతో ప్లస్ అవుతుంది. హీరోయిన్ అంకిత బాగుంది. పెర్ పార్మెన్స్ విషయంలోనూ మార్కులు కొట్టేసింది. రుబినాగా మారినప్పుడు, హీరోని ఇష్టపడే సీన్స్ లో బాగా చేసింది. తన క్యారెక్టర్ కు బాగా ఇంపార్టెన్స్ ఉంది. దీంతో చాలా కేర్ ఫుల్ గా నటించింది. ఈ సినిమాకు అంకిత పెర్ ఫార్మెన్స్ బాగా ప్లస్ అయ్యింది. హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన అనూష కూడా చాలా బాగా చేసింది. చాలా సీన్స్ లో తన టాలెంట్ చూపించింది. ఇక ఈ సినిమాకు రామ్ జగన్ మరో కీలక పాత్రలో కనిపించాడు. పోలీస్ ఆఫీసర్ గా తనదైన పెర్ పార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఝాన్సీ ఉన్నది కొద్దిసేపే అయినా పవర్ ఫుల్ రోల్ పోషించింది. హీరో ఫ్రెండ్ గా సాయి నవ్వులు తెప్పించాడు. జీవా ప్రొఫెసర్ గా ఇంపార్టెంట్ రోల్ పోషించాడు. సౌండ్ గురించి తాను చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ప్రభావతి కూడా ఎవ్వరూహించని పాత్రలో మెప్పించింది.
సాంకేతిక నిపుణుల విషయానికొస్తే… శ్రీ మురళీ కార్తికేయ అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చాలా సన్నివేశాల్ని నిలబెట్టాడు. ప్రవీణ్ బంగారి కెమెరా పనితనం ఎడిటింగ్ సరిగ్గా కుదిరాయి. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా కథకు తగ్గట్టుగా ఖర్చు పెట్టి క్వాలిటీ సినిమా తీశారనిపించింది. గ్రాఫిక్స్ విషయంలో సైతం రాజీ పడలేదు. అందరికీ అర్థమయ్యేలా దర్శకుడు వెంకట శివ ప్రసాద్ గ్రాఫిక్స్ చేయించుకున్నాడు. రెగ్యుల‌ర్ సినిమాల‌కు భిన్నంగా ఉంటుంది. కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ఇది. సౌండ్ పొల్యూషన్, పారా నార్మల్ యాక్టివిటీ, బై పోలార్ డిజార్డర్, సౌండ్ హిప్నాటిజమ్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఈ విషయాల గురించి దర్శకుడు బాగా రీసెర్చ్ చేసినట్టున్నాడు. ప్రతీ చిన్న విషయాన్ని చాలా క్లారిటీ గా గ్రాఫిక్స్ రూపంలో చూపించాడు. దీంతో కథ మీద ఇంట్రస్ట్ పెరిగింది. అసలు నిజాలు తెలిసే వరకు కథలో అనేక మలుపులు ఉన్నాయి. దర్శకుడి తొలి సినిమానే అయినప్పటికీ… సినిమాను చాలా బాగా డీల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడేవారికి ‘ఉందా.. లేదా..?’ మూవీ బెస్ట్ ఛాయిస్. గో అండ్ వాచ్ ఇట్!
రేటింగ్: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here