బెజవాడలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

గతంతో కంటే సైబర్ నేరాలు పెరిగాయని కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజయవాడ సిటీలో జరిగిన నేరాలు, ఛేదించిన కేసులపై 2017 సంవత్సరం నేరాల వార్షిక నివేదికను విడుదల చేశారు. బాలికల అదృశ్యానికి సంబంధించి148 కేసులు నమోదు కాగా 142 మంది బాలికలను క్షేమంగా వారి బంధువులకు అప్పచెప్పాం. మిగిలిన 6 గురు బాలికల కోసం గాలిస్తున్నాం.

రోడ్డు ప్రమాదాలు మొత్తం 1613 జరగగా అందులో 360మంది చనిపోగా, 1486 మందికి గాయాలయ్యాయి. హెల్మెట్ వాడకం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది 5,498 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయగా, 207 మందికి న్యాయస్దానం జైలు శిక్ష విధించగా, మిగిలిన వారికి ఫైన్ లు వేశాం. కొన్ని కుల, వర్గ, మతాల వారు రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు రెచ్చగొట్టే విధంగా జరిపిన ఆందోళనలు, బహిరంగసభలు, జన సమీకరణ విషయాల్లో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకోకుండా సమయ స్ఫూర్తితో వ్యవహరించాం.

విజయవాడ నగరంలో 907 సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి నేరాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. కొత్త రాజధానిలో అనేక సవాళ్ళను అధిగమిస్తూ సమయస్ఫుర్తి తో వ్యవహరించి కేసులను ఛేదించాం. కాల్ మనీకి సంబంధించి ఈ ఏడాది 1827 ఫిర్యాదులు అందగా 1772 ఫిర్యాదులు విచారించి 834 ఫిర్యాదులను పరిష్కరించాం. దేహ సంబంధమైన నేరాల్లో మర్డర్లు 33, కిడ్నాప్ లు 31, అత్యాచారం కేసులు 77, మనసును గాయపరిచిన కేసులు 596 నమోదయ్యాయి. ఈ ఏడాది ఆస్తి సంబంధ నేరాలు 2051 నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇవి తక్కువ ఆత్మహత్యలకు ప్రేరేపించిన కేసులు 22.22శాతం, కుటుంబ వేధింపులు 5.56 శాతం, నమ్మించి మోసం చెసిన ఘటనలు 18.33 శాతం, మహిళా అవమానాల్లో 32.83శాతం కేసులు, వివాహేతర సంబంధాలకు సంబంధించి 55.55 శాతం కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇవి పెరిగాయి.

చైన్ స్నాచింగ్ లు ఈ ఏడాది 80 నమోదయ్యాయి.. గ్రూపులు మీద నిఘా పెట్టడంతో గతేడాదితొ పోలిస్తే తగ్గాయి
గ్యాంబ్లింగ్, ఇతర జూదాలకు సంబంధించి 2017లో 2,375 కేసులు నమోదు అవ్వగా రూ.30, 25,172 లు సొత్తును స్వాధీనం చేసుకొన్నాం. గంజాయి అక్రమ రవాణాపై 16 కేసులు నమోదు చేయగా 65 మందిని అరెస్ట్ చేశాం.185 సైబర్ నేరాలు నమోదు కాగా, ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలకు సంబంధించి 120 కేసులు నమోదు కాగా, 46 కేసులు ఛేదించి రూ.27,83,649లు రికవరీ చేశాం
గతంతో పోల్చుకుంటే సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. మహిళలకు సంబంధించినవి 2017లో 992 కేసులు నమోదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *