సెప్టెంబర్ 6న విడుదల కానున్న జీవా, నయనతార నటించిన వీడే సరైనోడు సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది – సమర్పకులు జక్కుల నాగేశ్వరరావు

173

జీవా, నయనతార జంటగా తమిళంలో రూపొంది విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో ‘వీడే సరైనోడు’ పేరుతో అనువదిస్తున్నారు. నోవా సినిమాస్‌ పతాకంపై కోకా శిరీష సమర్పణలో జక్కుల నాగేశ్వరావు అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా సమర్పకులు జక్కుల నాగేశ్వరరావు మీడియాతో ముచ్చటించారు.

చిన్న సినిమాలు ఏడాదికి 150 వరుకు వస్తుంటాయి. కంటెంట్ బాగుంటే సినిమా తప్పకుండా ఆడుతుంది. గతంలో నేను చేసిన లవ్ జర్నీ సినిమాను ఆధరించారు. ఈ సినిమా కూడా అదే తరహాలో సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. ఈ సినిమాలో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి నటులు ఉన్నారు. క్లైమాక్స్ ఈ సినిమాకు ఆదనవు ఆకర్షణ కానుంది. మా సినిమా విడుదలకు సహకరించిన నిర్మాతలు దిల్ రాజు గారికి, సురేష్ బాబు గారికి, అల్లు అరవింద్ గారికి ధన్యవాదాలు.

సినిమా విడుదలకు మంచి డేట్ కుదిరింది. సుమారు 200 థియేటర్స్ లో వీడే సరైనోడు సినిమా విడుదల కానుంది. నయనతార, జీవ నటన సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది. ఈ సినిమా కోసం నాకు సహాయ పడిన వారందరికీ ధన్యవాదాలు. ప్రసన్న కుమార్, దామోదర్ ప్రసాద్, మోహన్ వడ్లపట్ల ఈ సినిమాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, వారికి స్పెషల్ థాంక్స్. సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మకం ఉందన్నారు.

నటీనటులు: జీవా, నయనతార

సాంకేతిక నిపుణులు:

సమర్పణ: జక్కుల నాగేశ్వరరావు
సంగీతం : శ్రీకాంత్‌ దేవా, సాహిత్యం : వెన్నెలకంటి, చంద్రబోస్‌
మాటలు : రాజశేఖర్‌ రెడ్డి
కథ,స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: ఆర్‌ . ఎస్‌.రామనాథం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here