రివ్యూ: ‘తొలిప్రేమ’

66

తారాగణం: వరుణ్ తేజ్, రాశి ఖన్నా, ప్రియదర్శి, సుహాసిని, నరేష్ తదితరులు
సంగీతం: తమన్ యస్.యస్
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
రచన – దర్శకత్వం: వెంకీ అట్లూరి

మెగా ఫ్యామీలీ నుంచి చాలా మంది యంగ్ హీరోలు వచ్చారు. కానీ వారిలో వరుణ్ తేజ్.. ఎంచుకునే కథలు చాలా భిన్నంగా వుంటున్నాయి. కంచె సినిమా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ మధ్య శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ‘ఫిదా’ సినిమాలో ఎక్కడా హీరో అనే బేషేజాలు చూపించకుండా నటించాడు. తనకంటే డామినేట్ చేసే క్యారెక్టర్లో సాయిపల్లవి నటించినా… తనకున్న పెర్ ఫార్మెన్స్ తో మెగా అభిమానులను అలరించాడు. తాగా తన బాబాయి్ టైటిల్ అయిన ‘తొలిప్రేమ’తో మన ముందుకొచ్చాడు. అప్పట్లో పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మరి వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ కూడా ఆకట్టుకుందో లేదో చూద్దాం పదండి.

కథ: ఆదిత్య(వరుణ్ తేజ్), వర్ష(రాశీ ఖన్నా) అనుకోకుండా రైల్వే స్టేషన్లో కలుసుకుంటారు. తొలిపరిచయమే ప్రేమగా మారుతుంది. ఒకరినొకరు ఇష్టపడుతారు. దాంతో వీరిద్దరూ ప్రేమికులిగా మారిపోతారు. అలా సాఫీగా సాగే వీరి ప్రేమ కాస్త మధ్యలో బ్రేకప్ అవుతుంది. అలా బ్రేకప్ అయిన వీరి ప్రేమ బంధం.. మళ్లీ బలపడిందా? వీరి ప్రేమ చివరకు ఎలా సఫలమైంది? అనేదే ‘తొలిప్రేమ’ మిగతా కథ.

కథ.. కథనం విశ్లేషణ: హృదయాలను తాకే ప్రేమకథలు తెరకెక్కిస్తే.. యూత్ బాగా కనెక్ట్ అయిపోతుంది. మొన్న విడుదలైన ఫిదా విషయంలో అదే రుజువైంది. తాజాగా వరుణ్ తేజ్ కూడా అలాంటి కథనే ఎన్నుకొని.. నటుడు కం దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించాడు. చిత్ర కథలో కొత్తదనం ఏమీ లేకపోయినా… టేకింగ్ మాత్రం చాలా ఫ్రెష్ గా వుంది. ఇద్దరు ప్రేమికులు మొదట ఒక్కటవ్వడం.. తరువాత చిన్న చిన్న అపార్థాలతో విడిపోవడం.. ఆ తరువాత తప్పు తెలుసుకుని ఒక్కటవ్వడం.. ఇలాంటి రొటీన్ ఫార్ములా ప్రేమకథ చిత్రాల్లో సాధారణమే. అయితే ఇలాంటి వాటిని కూడా ఫ్రెష్ గా చెప్పగలిగితే యూత్ ఆకర్షతులవుతారు. అదే చేశాడు దర్శకుడు వెంకీ.

ఫస్ట్ హాఫ్ లో కాలేజీ నేపథ్యంలో స్టోరీని నడిపించి.. నవ్వించే ప్రయత్నం చేశాడు. అలా ఇంటర్వెల్ వరకు కొనసాగించి.. హీరో.. హీరోయిన్ల ప్రేమకు బ్రేకప్ చేసేసి.. ద్వితీయార్థలంలో మళ్లీ వాళ్లను పరిచయం చేసి… ఇద్దరి మధ్య తలెత్తిన మనస్ఫర్థలకు ఫుల్ స్టాప్ పెట్టేసి.. ఇద్దరినీ ఒక్కటి చేశాడు. కాస్త ఫీల్ వున్న లవ్ సీన్లతో సినిమాను తీర్చిదిద్దడం వల్ల ‘తొలిప్రేమ’ హృదయాలను తాకుతుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి ఫీల్ గుడ్ లవ్ మూవీ అనిచెప్పొచ్చు. వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్ పడినట్టే.

వరుణ్ తేజ్ మరోసారి లవర్ బాయ్ గా సక్సెస్ అయ్యాడు. ఫిదాతో ఎలాగైతే మంచి పేరు తెచ్చుకున్నాడో.. ఇందులో కూడా అదే ఈజ్ ను చూపించారు. దాంతో వరుణ్ లవర్ బాయ్ ముద్ర గట్టిగా వేసుకోగలిగాడు. అతనికి జంటగా నటించిన రాశీ ఖన్నా కూడా మంచి నటన చూపింది. గతంలో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన ఈ అమ్మడు.. ఇందులో మాత్రం బెస్ట్ పెర్ ఫార్మెన్స్ నే చూపింది. తన కెరీర్లో బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రియదర్శిన కామెడీ పర్వాలేదు. ఇక మిగతా పాత్రలన్నీ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.
దర్శకుడు వెంకీ మంచి ఫీల్ గుడ్ వున్న లవ్ స్టోరీని ఎన్నుకోవడం మంచిదే అయింది. అయితే సెకెండాఫ్ పై మరింత వర్క్ చేయాల్సింది. అలా చేసుంటే.. ఈ సినిమా ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోయేది. ఇలాంటి స్టోరీకి థమన్ సంగీతం చాలా ప్లస్ అయింది. పాటలు.. నేపథ్య సంగీతం రెండింటిలోనూ ప్రాణం పెట్టి తన ప్రతిభ చూపారు. అలానే సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్ గా.. ఫ్రెష్ గా వుంది. కళాశాల నేపథ్యంలో వచ్చే సన్నివేషాలను గానీ… వరుణ్, రాశీల జంటను గానీ చాలా బాగా చూపించారు. నిడివి ఇంకాస్త తగ్గించాల్సింది. నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా పెట్టేశారు. సో.. ఈ వీక్ లో యూత్ కి ఈ సినిమా పర్ ఫెక్ట్ ఛాయిస్. గో అండ్ వాచ్ ఇట్!
రేటింగ్: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here