ఆగస్టు 15న వరుణ్ తేజ్ – సంకల్ప్ రెడ్డిల స్పేస్ ఫిలిం టైటిల్ మరియు రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్

13
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా “ఘాజీ” ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో స్పేస్ అడ్వెంచరస్ ఫిలిం తెరకెక్కుతోంది. నేడు ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ చిత్రం టైటిల్ ను ఎనౌన్స్ చేయడంతోపాటు.. విడుదల తేదీని ఆగస్టు 15వ తారీఖు ఉదయం 9.30కి ప్రకటించనున్నారు.
అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యుత్తమ సాంకేతిక విలువలతో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో జీరో గ్రావిటీ టెక్నాలజీతో వేయబడిన ప్రత్యేకమైన సెట్స్ లో షూటింగ్ జరిగింది. వరుణ్ తేజ్ & టీమ్ అందరూ జీరో గ్రావిటీలో ట్రయినింగ్ కూడా తీసుకొన్నారు.
అదితిరావు హైదరీ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్న ఇంకా టైటిల్ నిర్ణయించబడని ఈ చిత్రాన్ని సాయిబాబు జాగర్లమూడి-రాజీవ్ రెడ్డి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తుండగా.. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని సమర్పిస్తూనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
నటీనటులు: వరుణ్ తేజ్, అదితిరావు హైదరీ, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల తడితరులు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here