మూడు రాజధానులు బిల్లును ఆమోదించిన శాసనసభ.!

220

మొదటిసారిగా మూడు రాజధానుల బిల్లును శాసన సభ లో ప్రవేశ పెట్టగా, టిడిపి నేతలు కొంత ఆందోళన సృష్టించారు. శాసన మండలి లో మెజారిటీ ఎక్కువగా ఉండటం కారణంగా సెలక్ట్ కమిటీ కి బిల్లుని పంపాలని టిడిపి కోరడం జరిగింది. అయితే శాసన మండలి చైర్మన్ కి ముందస్తు నోటీస్ ఇవ్వకపోవడం, రాజ్యాంగ బద్దంగా చూస్తే దీనికి సరైన రీతిలో ప్రక్రియ జరగకపోవడం తో, మరొకసారి ఈ బిల్లులను అసెంబ్లీ లో ప్రవేశపెట్టారు.

పరిపాలన వికేంద్రీకరణ- ప్రాంతీయ సమానాభివృద్ది బిల్లు 2020 బిల్లును బుగ్గన రాజేంద్ర నాథ్ అసెంబ్లీ లో ప్రవేశ పెట్టారు. మరొక సి ఆర్ డీ ఏ రద్దు బిల్లు ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశ పెట్టారు. ఈ రెండు బిల్లులను శాసన సభ మూజువాణి ఓటుతో ఆమోదించడం జరిగింది. వీటి తో పాటుగా మరొక 10 బిల్లులను ఏపి ప్రభుత్వం ఆమోదించింది. ఏపి విలువ ఆధారిత పన్ను చట్టం 2005, జీఎస్టీ చట్టం, ఏపి అబ్కారీ చట్టం, ఏపి మద్య నిషధ చట్టం 1995, పురపాలక కార్పొరేషన్ చట్టం 1955, పురపలికల చట్టం 1965, ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ చట్టం, దేవాదాయ చట్ట సవరణ, ఈ బిల్లు, ట్రస్ట్ బోర్డులో నియామకాల కొరకు పెట్టీ ఆ బిల్లులను శాసన సభ ఆమోదించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here