15వ సారి తలపడనున్న బాలకృష్ణ… చిరంజీవి

80

తెలుగు హీరోలకు సంక్రాంతి ప్రత్యేక పండుగ. ఆ పెద్ద పండుగనాడు తమ సినిమాలతో బరిలోకి దిగుతారు. పోటీ నీదా.. నాదా.. అంటూ సవాల్ విసురుతారు. ఈ ఆనవాయితీ ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి ఉంది. రెండో తరం హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ మధ్య కొన్నేళ్లుగా పోటీ కొనసాగింది. ఒక సారి మెగాస్టార్ మూవీ హిట్ కొడితే మరో సారీ బాలయ్య ప్రతాపం చూపించేవారు. ఇప్పటి వరకు కేవలం పెద్ద పండుగనాడు మాత్రమే 9 సార్లు, ఇతర సందర్భాల్లో 6 సార్లు ఈ స్టార్ హీరోల సినిమాలు పోటీకి దిగాయి. చివరి సారి వీరిద్దరూ 2004 లో తల పడ్డారు. మళ్లీ పదమూడేళ్ల తర్వాత సీనియర్ హీరోల చిత్రాలు పోటీ పడనున్నాయి. చిరు ఖైదీ నంబర్ 150 అంటూ వస్తుండగా, బాలయ్య గౌతమి పుత్ర శాతకర్ణి గా యుద్ధానికి ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దపండుగతో పాటు మిగిలిన రోజుల్లో పోటీ పడిన చిరు, బాలయ్య చిత్రాలు ఈ క్రింద జాబితాలో ఉన్నాయి…

1. మంగమ్మగారి మనవడు – ఇంటిగుట్టు – 1984

2. కథానాయకుడు – రుస్తుం – 1984

3. ఆత్మబలం – చట్టంతో పోరాటం – 1985

4. నిప్పులాంటి మనిషి – కొండవీటి రాజా – 1986

5. అపూర్వ సహోదరులు – రాక్షసుడు – 1986

6. భార్గవ రాముడు – దొంగ మొగుడు – 1987

7. రాము – పసివాడి ప్రాణం – 1987

8. ఇన్ స్పెక్టర్ ప్రతాప్ – మంచిదొంగ – 1988

9. రాముడు భీముడు – యుద్దభూమి – 1988

10. పెద్దన్నయ్య – హిట్లర్ – 1997

11. వంశోద్ధారకుడు – అన్నయ్య – 2000

12. నరసింహ నాయుడు – మృగరాజు – 2001

13. భలేవాడివి బాసు – శ్రీ మంజునాథ – 2001

14. లక్ష్మీ నరసింహా – అంజి – 2004

15. గౌతమి పుత్ర శాతకర్ణి – ఖైదీ నంబర్ 150 – 2017

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here