జనవరి 29 న బ్రహ్మాండమైన విడుదల ‘చెప్పినా ఎవరూ నమ్మరు’

84

శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్ నటీనటులుగా ఆర్యన్ కృష్ణ దర్శకత్వంలో ఎం.మురళి శ్రీనివాసులు నూతనంగా నిర్మిస్తున్న “చెప్పినా ఎవరూ నమ్మరు”చిత్రాన్ని మొదట జనవరి 1 న విడుదల చేయలనుకున్నాము.కానీ సినిమా హాల్స్ కొరత కారణంగా జనవరి నెల 29 వ తేదీన మా చిత్రాన్ని మీ అభిమాన హాల్స్ లో విడుదల చేస్తున్నాము.ఈ సందర్భంగా

సినిమా హీరో మరియు డైరెక్టర్ మాట్లాడుతూ … మేము విడుదల చేసిన ట్రైలర్,ఫస్ట్ లుక్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా బాగా ఆదరించారు.డిస్ట్రిబ్యూటర్లు సినిమా ట్రైలర్ చూసి థియేటర్ లలో మా సినిమాను విడుదల చెయ్యడానికి ముందుకు వచ్చారు.డిస్ట్రిబ్యూటర్లు ముందుకొచ్చి మా సినిమాను విడుదల చేస్తామని చెప్పడంతో,మా ఫస్ట్ అటెంప్ట్ కే ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది.మూవీ మాక్స్ అధినేత శ్రీనివాసులు ద్వారా మా సినిమాను జనవరి 29 న విడుదల చేస్తున్నందుకు వారికి మా ధన్యవాదాలు అని అన్నారు.

చిత్ర నిర్మాత మాట్లాడుతూ… మా బ్యానర్ లో నిర్మిస్తున్న “చెప్పినా ఎవరు నమ్మరు” సినిమాలో న్యాచురల్ సీన్స్ ఉంటాయి.సినిమా బాగా వచ్చింది.మా శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో మరిన్ని సినిమాలను నిర్మించి మంచి పేరు తెచ్చుకొని ప్రేక్షకుల ఆదరణ పొందుతామని ఆశిస్తున్నామని అన్నారు..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here