రైతు నాయకుడికే నకిలీ విత్తనాలు అంటగట్టిన ఘనులు!

24

 

0ca1f75a-d8a4-47f6-9055-f7b0470ad952 (1) ‘రైతే రాజు’ అనే భుజకీర్తులను వదిలేసి.. ‘జైకిసాన్’ అంటూ ఈ జాతి చేసిన అందమైన నినాదాలను మరచిపోయి.. ఓ రైతు నేత దయనీయంగా ఇదేనా వ్యవసాయం ? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత దుర్భరంగా.. పులి మీద పుట్రలా కరవు.. వీటికి తోడు నకిలీ విత్తనాల చీడ! ఏం చేస్తారు రైతులు పాపం!!  ‘నకిలీ విత్తనాలతో ఓ రైతుకు చెందిన మొక్కజొన్న పంట మొత్తం దెబ్బతింది. పెట్టుబడి కూడా దక్కడం లేదు.  మొక్కజొన్న విత్తనాలు అంటగట్టారు.ఇప్పుడు పంట చేతికి రావడం లేదు. భూగర్భ జలాల కొరత,నీటి కరవును దృష్టిలో పెట్టుకుని వరి సాగు మానుకుని మొక్కజొన్న పంట పెట్టారు. ఓ రైతు మూడెకరాలకు సుమారు రూ. 30 వేలు పెట్టుబడి అయింది.ఇప్పుడు పంట చేతికి వస్తున్న దశలో మొక్కజొన్న కంకులు విచిత్రంగా కాస్తున్నాయి. మొక్కజొన్న కంకులు జొన్నచేను కంకుల మాదిరిగా పైన విత్తులు లేని కంకులు రావడం గమనార్హం.కొన్నింటికి అసలు కంకులు కూడ రాలేదు. అదేవిధంగా కంకులు పూర్తిగా కుంచించుకున్నట్టు విత్తులు లేకుండ చెట్టుకు పైన కాస్తున్నాయి.విచిత్రమైన పంట విపత్కర పరిస్తితి ఇది. సూపర్ సీడ్స్ – సూపర్ 9090 హైబ్రిడ్ మేజ్ ను స్థానిక భవానీ ఫర్టిలైజర్ అండ్ సీడ్స్ దుకాణం ద్వార ఖరీదు చేశారు.

మూడేకరాలకు కనీసం ఎంత లేదన్నా రైతు సుమారు ఎనభై వేలకు పైగా నష్ట పోవాల్సిందే.
ఈ సమస్య ఒక్కరిదో కాదు ఈ
సూపర్ సీడ్స్ – సూపర్ 9090 హైబ్రిడ్ మేజ్ కొన్న ప్రతి రైతు దగా పడబోతున్నారని గుర్తించాల్సిందే..!
కంకుల సాగు నకిలీ విత్తనాలతో ఇప్పుడు రైతులకు కష్టాలు తెచ్చి పెట్టింది. పంట ఏపుగా పెరిగినప్పటికీ కూడా పైసా లాభం లేకపోవడంతో మొక్క జొన్న రైతు కళ్లనీళ్ల పర్యంతమవుతున్నారు. రోజు రోజుకూ పతనమవుతున్న ధరలతో మొక్కజొన్న రైతు ఓ వైపు గుండె బరువెక్కుతోంటే మరో వైపు రైతుల్ని నకిలీ విత్తనాల మాయలో పడేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here