‘ఏంజిల్’ కు థియేటర్లలో అనూహ్య స్పందన

శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ ‘ఏంజెల్’. సోషియో ఫాంటసీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకి రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకుడు. ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి. ఈ చిత్రం నవంబర్ 3న విడుదలై ప్రేక్షాకాదరణ పొందుతోంది. సోసియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో సాగుతున్న ఈ చిత్రానికి థియేటర్ల లో అనూహ్య స్పందన లభిస్తోంది. 45 నిమిషాలకు పైగా సీజీ సీన్స్ ఉండడంతో దాదాపు నాలుగు నెలలు కష్టపడి పని చేశారు సినిమా యూనిట్. వీక్షిస్తున్న ప్రేక్షకులు ఏంజిల్ కు నీరాజనాలు పడుతున్నారు. శుక్రవారం నుంచి నేటి వరకు కలెక్షన్స్ ల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తోంది. ఆదివారం హైదరాబాద్ లోని పలు థియేటర్ లను సందర్శించారు ఏంజిల్ యూనిట్. ఈ నేపథ్యంలోనే ఆదివారం మధ్యాంహ్నం 12 గంటలకు శివ పార్వతి థియేటర్, 3గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని దేవి థియేటర్, సాయంత్రం 4 గంటలకు దిలీషుఖ్ నగర్ లోని రాజధాని థియేటర్ లలో చిత్రం లలిత మూసపెట్9:30pmకు ప్రదర్శిస్తున్న సమయంలో హెబ్బా పటేల్, నాగ అన్వేష్, దర్శకుడు పలణి, నిర్మాత సిందూరపువ్వు కృష్ణా రెడ్డి తదితర బృందం అంతా సందర్శించారు. ప్రేక్షక మహాశయులు ఏంజిల్ యూనిట్ కు బ్రహ్మరథం పట్టారు. సినిమా అలరిస్తున్నందుకు దర్శక నిర్మాతలను, హీరో హీరోయిన్స్ ను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *