రివ్యూ: ‘స్నేహమేరా జీవితం’

397

తారాగణం- శివబాలాజీ, రాజీవ్ కనకాల, సుష్మ యార్లగడ్డ, సత్య తదితరులు

సంగీతం-సునీల్ కశ్యప్

ఛాయాగ్రహణం- భరణి ధరన్

నిర్మాత: శివబాలాజీ

రచన-దర్శకత్వం: మహేష్ ఉప్పుటూరి

ఇటీవల శివబాలాజీ  ‘కాటమరాయుడు’తో మంచి పేరు సంపాదించిన సమయంలోనే ‘బిగ్ బాస్’ షోలో పాల్గొని అందులో విజేతగా నిలిచి, మరింతగా జనాల మనసులు చూరగొన్నాడు. ఇలాంటి సమయంలో శివబాలాజీ హీరోగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ‘స్నేహమేరా జీవితం’ సినిమాను మంచి టైమింగ్‌ చూసి రిలీజ్ చేశాడు. మంచి బజ్ మధ్య రిలీజైన ఈ సినిమా  ద్వారా శివబాలాజీ మరోసారి విజేత అయ్యాడెమో తెలియాలంటే సినిమా కథలోకి వెళ్దాం…

కథ…80వ దశకం నేపథ్యంలో సాగే సినిమా ‘స్నేహమేరా జీవితం’. మోహన్ (శివబాలాజీ) అనే అనాథ అయిన కుర్రాడు.. చలపతి అనే కొంచెం డబ్బు, పొగరు బాగా ఉండి రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిపోవాలని చూసే మరో కుర్రాడు చలపతి (రాజీవ్ కనకాల).. వీళ్లిద్దరూ తమ మధ్య అంతరాల్ని పక్కన పెట్టేసి మంచి స్నేహితులుగా కొనసాగుతుంటారు. మోహన్.. చలపతికి చెందిన కొయ్యల డిపోలోనే పని చేస్తుంటారు. వీళ్లిద్దరి స్నేహం సాఫీగా సాగిపోతున్న సమయంలోనే మోహన్‌,  ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయికి కూడా అతడిపై ఇష్టం ఉన్నట్లే ఉంటుంది. కానీ ఆ అమ్మాయిని చలపతితో కలిపి చూడకూడని పరిస్థితుల్లో చూసి కోపం పెంచుకుంటాడు. అతడి మనసు విరిగిపోతుంది. తన స్నేహితుడిపై కోపం పెంచుకుంటాడు. మరోవైపు లేని పోని గొడవల్లో తలదూర్చడం వల్ల అతడి జీవితం కొన్ని మలుపులు తిరుగుతుంది. అయితే చలపతి నిజంగా అన్యాయం చేసాడా? ఈ పరిస్థుతలను అతను ఎలా ఎదుర్కుంటాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

సినిమా ఎలా ఉందంటే…

30-40 ఏళ్లు వెనక్కి వెళ్లి అప్పటి నేపథ్యంలో ఓ కథను ఆసక్తికరంగా చూపించారు. ఈ సినిమా దర్శకుడు మహేష్ ఉప్పుటూరి పరిమిత బడ్జెట్ వనరులతోనే 80ల నాటి వాతావరణాన్ని అందంగా చూపిస్తూ.. మంచి ఎమోషనల్ టచ్ ఉన్న కథను ఆసక్తికరంగా చెబుతూ.. రెండు గంటలకు పైగా ప్రేక్షకుల్ని కూర్చోబెట్టగలిగాడు. ఇద్దరు మిత్రుల మధ్య స్నేహం… వారి లవ్ స్టోరీ.. కామెడీ సీన్స్‌తో సరదాగా, వేగంగా సాగే ఈ సినిమా ప్రథమ భాగం ఆసక్తికరంగా సాగిపోతుంది. ఆ తరువాత వచ్చే సెకండ్ ఆఫ్ లో ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. శివబాలాజీ గతంలో ఎన్నడూ చేయని పాత్రను ఇందులో చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఓ పల్లెటూరి యువకుని పాత్రలో.. తన మిత్రునికోసం(రాజీవ్ కనకాల) ప్రాణాలిచ్చి మిత్రుడి పాత్రలో చక్కగా నటించారు. ముఖ్యంగా ద్వితీయార్థంలో తను పలికించిన హాబ భావాలు ప్రేక్షకుల్ని ఉత్కంటతకు గురి చేస్తాయి. తన మిత్రుడు ఎలాంటి పొరపాటు చేయాలేదని… తానే అతన్ని చంపడానికి ఆవేశపడ్డానాని తెలుసుకుని… దాన్నుంచి బయటపడటపానికి శివబాలాజీ చూపించిన నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఏనభైల్లో జరుగుతున్న కథలానే అనిపించినా… ఇప్పటి తరం యువతకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. అందుకే ప్రతి ఒక్కరూ తమ స్నేహాన్ని గుర్తుంచుకుంటారు  ఈ సినిమాను చూస్తున్నంతసేపు. అలానే నటుడు రాజీవ్ కనకాల ఇదరూ కూడా సినిమా ని నిలబెట్టే విధంగా నటించారు. శివబాలాజీ నిర్మాణం చాలా రిచ్ గా వుంది. ఎక్కడా రాజీ పడకుండా… ఎనభైయ్యవ దశకం ధీమ్ ను మెయింటైన్ చేస్తూ బాగా తెరకెక్కించాడు. . హీరోయిన్ కూడా తనవంతు తాను చక్కగా నటించింది.  జ్యోతి లక్ష్మి, జయమాలినిలను గుర్తు చేసే రెండు పాటలు సినిమాలో ఉన్నాయి.మహేష్ ఉప్పుటూరి రచయితగా, దర్శకుడిగా తన పనితనం చూపించాడు. పాత్రల్ని తీర్చిదిద్దుకున్న తీరులో, సంభాషణల విషయంలో సహజత్వం కనిపిస్తుంది. పరిమిత బడ్జెట్లోనే 80ల వాతావరణాన్ని చక్కగా చూపిస్తూ ఉన్నంతలో మంచి క్వాలిటీలోనే సినిమా తీశాడు. మొత్తం మీద సినిమాకి మంచి పేరు వచ్చింది. థియేటర్లలో బాగా వసూళ్లను రాబట్టే అవకాశం వుంది.

రేటింగ్..3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here