అమర వీరుల పిల్లలకు ఆర్థిక సాయం

పోలీస్ వ్యూ నాల్గవ వార్షికోత్సవ వేడుకలు విశ్వేశ్వరయ్య భవన్ , ఖైరతాబాద్ నందు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల పిల్లలకు స్కాలర్ షిప్ లు, అనాధ పిల్లలకు బట్టలు, మధర్ థెరిసా ఆశ్రమ పాఠశాల పిల్లలకు యూనిఫారాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాన్ని పోలీస్ వ్యూ చీఫ్ ఎడిటర్ ప్రేమ్ కుమార్ తోపాటు ఎడిటర్ విశ్వేశ్వర రెడ్డిలు చేపట్టారు. రాయచోటి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, ఎస్సీ నేషనల్ కమీషనర్ కె. రాములు, ఓఎస్డీ  ఎంకె సింగ్ లు హజరయ్యారు.

అనాధ పిల్లలతో పాటు పోలీస్ అమరవీరులు చిన్నారుల చదువులకు ఆర్థికసాయం అందించడంతో పాటు ఎందరో పోలీసు వీరుల విజయగాధలను ప్రపంచానికి చాటిచెప్పడానికి పోలీస్ వ్యూ కట్టుబడి ఉందని దీనికి తమవంతు సాయం అందిస్తామని కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు అన్నారు.

పోలీసు అమరవీరుల చిన్నారులకు, అనాధ పిల్లలకు ఉచితంగా హోమియో వైద్యం అందించడానికి సుముఖత వ్యక్తం చేస్తూ పోలీసు వ్యూ తో భాగస్వామి అయ్యారు.  మేగజైన్ లో శీర్షిక ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు సూచనలు, సలహాల అందిస్తామని ప్రముఖ హోమియో వైద్య నిపుణులు, పోలీస్ వ్యూ చీఫ్ అడ్వైజర్ మధు వారణాసి అన్నారు.

మూడేళ్ల పోలీస్ వ్యూ ప్రస్థానంలో ఎన్నో మజిలీలు మరెన్నో అనుభూతులను మిగిల్చింది.  ఈ ఏడాది నుంచి నవరసాలతో కూడిన షడ్ రుచులను అందించగలమని ఎడిటర్ కె విశ్వేశ్వర రెడ్డి అన్నారు.

పోలీస్ వ్యూ గురించి

2013 డిసెంబర్ లో ప్రారంభమైన పోలీస్ వ్యూ మేగజైన్ మూడేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసింది. పోలీస్ వీరుల విజయగాధలను ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యంగా నడుస్తున్న ఈ పత్రిక ఇటీవల వెబ్ చానెల్ ను కూడా ప్రారంభించింది.  పోలీసు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వానికి చేరవేడం ద్వారా వాటి పరిష్కారానికి మార్గం చూపుతోంది.  పోలీసులను జనానికి మరింత చేరువ చేయడం ద్వారా ఫ్రెండ్లీ పోలీసింగ్  చేపట్టడంలో  ముఖ్య భూమిక పోషిస్తోంది.  రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ల సలహాలను, సూచనలను తెలియజేయడం ద్వారా పోలీస్ వ్యవస్థలో కొత్త శకానికి నాంధి పలుకుతోంది. భవిష్యత్ లో జాతీయ స్థాయిలో పోలీసు సమాచారం ఇవ్వడానికి ప్రణాళిక చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *