స‌వ్య‌సాచి టీజ‌ర్ కు అద్భుత‌మైన స్పంద‌న‌

37
స‌వ్య‌సాచి తొలిపాట విడుద‌ల తేదీ క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అక్టోబ‌ర్ 9న ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో విడుద‌ల కానుంది. ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ మ‌ధ్యే విడుద‌లైన టీజ‌ర్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. యూ ట్యూబ్ లో 50 ల‌క్ష‌ల వ్యూస్ తో ట్రెండింగ్ లో నిలిచింది స‌వ్య‌సాచి టీజ‌ర్. ఇందులో రెండు చేతుల‌తోనూ ఒకే బ‌లం చూపించే స‌వ్య‌దిశ వ్య‌క్తిగా చైతూ న‌టిస్తున్నారు. మ‌హాభారతంలో అర్జునుడికి మాత్ర‌మే ఉన్న శ‌క్తి ఇది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమాల్లో రాన‌టువంటి కొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు చందూమొండేటి. స‌వ్య‌సాచిలో మాధ‌వ‌న్, భూమికా చావ్లా కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నిధి అగ‌ర్వాల్ ఈ చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతుంది. హ్యాట్రిక్ మూవీస్ ఇచ్చిన మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ నుంచి స‌వ్య‌సాచి వ‌స్తుంది. న‌వంబ‌ర్ లో ఈ చిత్ర విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.
న‌టీన‌టులు:
నాగ‌చైత‌న్య‌, నిధి అగ‌ర్వాల్, ఆర్ మాధ‌వ‌న్, భూమికా చావ్లా, వెన్నెల కిషోర్, స‌త్య, రావు ర‌మేష్, తాగుబోతు ర‌మేష్ త‌దిత‌రులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here