ఏపీ స‌చివాల‌యంలో సంక్రాంతి ఆహార పండుగ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ నేతృత్వంలో సంక్రాంతి వేడుక‌ల శుభ‌వేళ స‌చివాల‌య ఉద్యోగుల కోసం ప్ర‌త్యేక తెలుగు వంట‌కాలను అందిస్తున్న‌ట్లు ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ స‌చివాల‌య ఉద్యోగుల స‌హ‌కార సంఘ ప‌ల‌హార శాల స‌హ‌కారంతో నాలుగు రోజుల పాటు స‌చివాల‌య ప‌ల‌హార శాల‌లో ఆహార పండుగ జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌తి రోజు ఒక విశేష వంట‌కాన్ని ప‌ర్యాట‌క శాఖ త‌రుపున భోజ‌నంతో పాటు అందించ‌టం జ‌రుగుతుంద‌న్నారు.

మంగ‌ళ‌వారం రాగిసంక‌టి, వేరుశ‌న‌గ ప‌చ్చ‌డి,

బుధ‌వారం దంపుడు బియ్యం ప‌లావ్, కుర్మా,

గురువారం మెంతికూర ట‌మాటా అన్నం,కుర్మా,

శుక్ర‌వారం బెల్లం పొంగ‌లి, మ‌షాల వ‌డ స‌చివాల‌య ప‌ల‌హారశాల‌లో అందించ‌టం జ‌రుగుతుంద‌న్నారు. ప‌ర్యాట‌క శాఖ అందించే ఈ వంట‌కాల‌కు అద‌న‌పు చెల్లింపుల అవ‌స‌రం లేద‌ని, రాష్ట్రం ఆరోగ్య‌, ఆనంద ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా ఉండాల‌న్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయిడు ఆదేశాల మేర‌కు తొలిసారి ఈ త‌ర‌హా కార్య‌క్ర‌మాన్ని తీసుకోవ‌టం జ‌రిగింద‌న్నారు. ఉద్యోగులు ఈ స‌ద‌వ‌కాశాన్ని వినియోగించుకుని, తెలుగు వంట‌కాల ప్రాచుర్యానికి స‌హ‌క‌రించాల‌ని ముఖేష్ కుమార్ మీనా వివ‌రించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *