సాగరతీరంలో ఆడియో విడుదల

29
సంగీత దర్శకుడు భోలె అందించిన అద్భుతమైన పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ రోజు విడుదలైనయి. ఈ అందమైన పాటలు సక్సెస్స్ ఫుల్ నిర్మాత మల్కాపురం, రేలంగి నరసింహ రావు విడుదల చేసారు.
పాటలు విని రేలంగి నరసింహ రావు మాట్లాడుతూ ‘పాటలు చాలా బాగున్నాయి, సంగీత దర్శకుడు భోలె చక్కటి సంగీతం అందించాడు. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. దర్శకుడు ధర్మారావు EEV సత్యనారాయణ దగ్గర పని చేసాడు. టాలెంట్ ఉన్న దర్శకుడు. ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఈ సాగరతీరంలో సినిమా మంచి విజయం కావాలి’ అని కోరుకున్నారు.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ‘టైటిల్ చాలా బాగుంది, పాటలు బాగున్నాయి, చిన్న సినిమా ని అందరూ ప్రోత్సహించాలి. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్న’ అని తెలిపారు.
కోనసీమ పరిసర ప్రాంతాలైన అమలాపురం, ముమ్మిడివరం, పాండిచ్చేరి యనంతో పాటు ఎన్ రామేశ్వరం, ఓడలరేవు, కొమరగిరిపట్నం తదితర తీరప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం అని చిత్ర ుునిట్ తెలియజేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here